తెలంగాణా కోసం రక్తతర్పణంఃటిఆర్‌ఎస్
మహబూబ్ నగర్‌ః తెలంగాణా రాష్ట్ర సాధనకు ప్రాణాలైనా అర్పిస్తానని తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్రశేఖర రావు ప్రకటించారు. తెలంగాణా రాష్ట్ర సాధనకోసం చేపట్టిన ఉద్యమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణా ఆక్రందన పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభలో చంద్రశేఖర రావు మాట్లాడుతూ తెలంగాణా ప్రజలు తాగేందుకు గుక్కెడు నీళ్ళు లేక అల్లాడుతుటే పులిచింతల, పోలవరం ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి సారించడం అన్యాయమని విమర్శించారు.
పులిచింతల, పోలవరం ప్రాజెక్టులనే గనుక ప్రభుత్వం ప్రారంభిస్తే ఆ ప్రాజెక్టుల్లో పారేది కృష్ణా, గోదావరి జలాలు కావని, తెలంగాణా ప్రజల రక్తం పారుతుందని ఆయన హెచ్చరించారు. తెలంగాణా ప్రజలను కాంగ్రెస్, బిజెపి నేతలు నిలువున్నా మోసగిస్తున్నారని, వారికి పదవులే కానీ తెలంగాణా ప్రజల సంక్షేమం ఏ మాత్రం ముఖ్యం కాదని ఆయన విమర్శించారు.
మహబూబు నగర్ సభలో పాల్గొనేందుకు చంద్రశేఖర రావు హైదరాబాద్ నుంచి బయలు దేరి దారిలో శంషాబాద్, గద్వాల తదితర పట్టణాలలో పార్టీ పతాకాలను ఆవిష్కరించారు. దారిపొడవున్న కార్యకర్తలు, మహిళలు చంద్రశేఖర రావుకుఘనంగా స్వాగతం పలికారు. ఆయన ప్రసంగాలను ప్రజలు ఆలకించారు. ఆ తరువాత జరిగిన మహబూబ్ నగర్ సభకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు.












Click it and Unblock the Notifications
