జయ మాజీ దత్త పుత్రుడి అరెస్టు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మాజీ దత్త పుత్రుడు వి.ఎన్. సుధాకరన్‌ను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను సైదాపేట పోలీసు స్టేషన్‌లో నిర్బంధించారు. సుధాకరన్ వ్యక్తిగత కార్యదర్శి గోపీశ్రీధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. సుధాకరన్ నుంచి పోలీసులు ఒక పిస్టల్‌ను, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.
గతంలో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు జయలలిత సుధాకరన్‌ను దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత వదిలేసుకున్నారు. సుధాకరన్ స్వతంత్రంగా ఒక రాజకీయ సంస్థను నడుపుతున్నాడు. ఆయన మద్దతుదారులు సుధాకరన్‌ను చిన్న ఎంజిఆర్ అని పిలుస్తారు.












Click it and Unblock the Notifications