స్విగ్గీ డెలివరీ బాయ్ సంపాదన రూ.53 లక్షలు - ఎలా సాధ్యమైంది..!!
ఇప్పుడు స్విగ్గీ బాయ్ ఆదాయం లెక్కలు వైరల్ అవుతున్నాయి. ఏకంగా రూ 53 లక్షలు స్విగ్గీ బాయ్ సంపాదన సంచలనంగా మారుతోంది. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీలో డెలివరీ పార్ట్‌నర్‌గా పనిచేస్తూ గత 8 ఏళ్లలో అతడు ఏకంగా రూ.53 లక్షలు సంపాదించాడు. ఈ విషయాన్ని స్విగ్గీ సంస్థ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పంచుకోవడంతో శంకర్ కథనం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గిగ్ ఎకానమీ.. సంపాదన పై ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
స్విగ్గీ డెలవరీ బాయ్ ఆదాయం ఎంతో తెలుసా. ఏటా రూ. ఆరు లక్షలకు పైనే. ఎనిమిదేళ్లలో ఏకంగా రూ.53 లక్షల సంపాదించారు. చిన్న ఉద్యోగమే అయినా.. నచ్చిన వేళల్లో స్వేచ్ఛగా పనిచేస్తూ, నిరంతర కృషితో తన కుటుంబ ఆర్థిక పరిస్థితులను చక్కగా మార్చుకున్న ఓ సామాన్యుడి సక్సెస్ స్టోరీ ఇప్పుడు వైరల్ అవుతోంది. 'స్విగ్గీ' డెలివరీ బాయ్‌గా వచ్చిన అవకాశాన్ని శంకర్ సద్వినియోగం చేసుకున్నాడు. స్విగ్గితో తన ప్రయా ణం మొదలైనప్పుడు.. ఈ ప్లాట్‌ఫామ్ తన జీవితా న్ని ఇంతలా మారుస్తుందని కలలో కూడా ఊహించలేదని శంకర్ పేర్కొన్నాడు. ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా, తనకు వీలైన సమయంలో పనిచేస్తూ.. తనకు తానే బాస్‌లా వ్యవహరిస్తూ ఇంతమేర సంపాదించానని అతడు పేర్కొనడం గమనార్హం. ఇప్పుడు తన పిల్లలను బాగా చదివించుకుంటున్నానని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయాయని అతడు వెల్లడించాడు.

ప్రణాళికా బద్దంగా డ్యూటీ.. ఆదాయం
సగటున ఏడాదికి రూ.6.62 లక్షలు, నెలకు సుమారు రూ.55,208 చొప్పున శంకర్ ఆదాయం అందుకున్నాడు. అంటే, రోజుకు దాదాపు రూ.1,815 వరకు సంపాదించినట్లు తెలుస్తోంది. ఈ ఆదాయంతోనే తన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించగలిగానని, కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించగలిగానని శంకర్ తెలిపాడు. గంటల తరబడి పనిచేయడం కాకుండా, శంకర్ తెలివైన వ్యూహాన్ని అనుసరించాడు. ఆర్డర్లు ఎక్కువగా ఉండే లంచ్ (ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు), డిన్నర్ (సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు) పీక్ అవర్స్‌లో మాత్రమే లాగిన్ అయ్యేవారు. దీనివల్ల ఎక్కువ ఆర్డర్లు, సర్జ్ ప్రైసింగ్, రోజువారీ ఇన్సెంటివ్‌లు పొందగలిగాడు. తనకు నచ్చిన సమయంలో పనిచేసే స్వేచ్ఛ ఉండటంతో కుటుంబంతో గడపడానికి, పనికి మధ్య సమతుల్యత పాటించడం సులభమైందని చెప్పుకొచ్చారు.













Click it and Unblock the Notifications
