TTD: మూడు దశాబ్దాల విధానానికి స్వస్తి, కీలక మార్పులు..!!

తిరుమలలో భక్తుల రద్దీ కొంత తగ్గింది. స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుుతున్నందున ముందుగా టోకెన్లు తీసుకున్న వారు తిరుమలకు చేరుకుంటున్నారు. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ కేంద్రాల్లో తిరుమలలోని శ్రీవారి భక్తులకు నిత్యం జారీచేసే సర్వదర్శన టోకెన్లను మరో నాలుగు రోజులపాటు నిలిపివేయనున్నారు. కాగా.. టీటీడీ లో మూడు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న విధానంలో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

టీటీడీ కొత్త నిర్ణయాలు అమలు చేస్తోంది. ఇప్పటికే భక్తులకు వేగంగా దర్శనం అందే విధంగా క్యూ లైన్ మేనేజ్ మెంట్ సిస్టమ్ విధానం కొనసాగిస్తోంది. అదే విధంగా వసతి గదుల కేటాయింపు విషయంలోనూ సాంకేతికతను వినియోగించుకోవాలని సేవలను పెంపొందించే విధంగా కొత్త విధానం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక.. ఇప్పుడు మూడు దశాబ్దాల కాలంగా ఉన్న ఎకౌంటింగ్ విధానంలో సంస్కరణలను అమలు చేయాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా ఎకౌంటింగ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు భారత చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ సంస్థ (ఐసీఏఐ) సమగ్ర అధ్యయనం చేపట్టింది. తాజా అవసరాలకు అనుగుణంగా ఒక అకౌంటింగ్‌ మాన్యువల్‌ను ఐసీఏఐ రూపొందించి అందజేయనుంది. ఇప్పటికే ఐసీఏఐకి చెందిన అకౌంటింగ్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ ప్రాథమిక అధ్యయనం ప్రారంభించింది. ప్రస్తుతం టీటీడీలో ఎంటర్‌ప్రైజ్‌ రిసోర్స్‌ ప్లానింగ్‌ (ఈఆర్‌పీ) ఆధారిత సమగ్ర అకౌంటింగ్‌ వ్యవస్థ అమలులో ఉంది. ఈ వ్యవస్థను ఆధునికీకరించే లక్ష్యంతో ఈ కసరత్తు కొనసాగుతోంది.

 పట్టాలెక్కుతున్న విశాఖ - బెంగళూరు వందేభారత్ స్లీపర్: రూట్, టైమింగ్స్ ఫిక్స్..!!
పట్టాలెక్కుతున్న విశాఖ - బెంగళూరు వందేభారత్ స్లీపర్: రూట్, టైమింగ్స్ ఫిక్స్..!!
ttd-to-modernize-30-year-old-accounting-system-as-part-of-reform-initiatives-here-the-details

తిరుమలలో కొత్త అకౌంటింగ్ వ్యవస్థ

టీటీడీ అకౌంటింగ్‌ విధానాన్ని ఆధునికీకరించడంతో పాటు దాని ఆస్తులను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ) సహాయం చేస్తోంది. స్వామివారికి భక్తులు కానుకగా ఇచ్చిన భూములను రియల్‌ ఎస్టేట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ట్రస్ట్‌(ఆర్‌ఈఐటీ)ల ద్వారా నగదు రూపంలోకి మార్చేందుకు మార్గదర్శకాలను అందిస్తోంది. టీటీడీ వద్ద ఉన్న భారీ బంగారు నిల్వలను కచ్చితంగా ధ్రువీకరించేందుకు, వాటి విలువను లెక్కించేందుకు సహాయం చేస్తోంది. మూడు దశాబ్దాల నాటి లెక్కల విధానాన్ని ప్రస్తుతం టీటీడీ వినియోగిస్తోందని ఐసీఏఐ అధ్యక్షుడు ప్రసన్నకుమార్‌ తెలిపారు. కొచ్చిలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రస్తుత కాలానికి అనుగుణంగా సరికొత్త అకౌంటింగ్‌ మాన్యువల్‌ను ఐసీఏఐ సిద్ధం చేస్తోందని, ఇది దాదాపు పూర్తి కావచ్చిందని వెల్లడించారు ఈ కొత్త విధానాలపై టీటీడీ సిబ్బందికి అవగాహన, సామర్థ్య పెంపు శిక్షణ సైతం ఐసీఏఐ ఇవ్వనుందని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+