Viral Video: చేపల పడవను ఢీకొట్టిన భారీ నౌక.. కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!

Viral Video: సింగపూర్ జలసంధి సమీపంలో భారీ సముద్ర ప్రమాదం చోటుచేసుకుంది. పనామా జెండాతో ప్రయాణిస్తున్న 229 మీటర్ల పొడవైన భారీ రవాణా నౌక.. చెనాకు చెందిన సుమారు 49 మీటర్ల పొడవైన చేపల వేట నౌకను ఢీకొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రమాద సమయంలో చేపల పడవలో ఉన్న సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గట్టిగా పట్టుకున్న దృశ్యాలు ఫుటేజ్‌లో కనిపిస్తున్నాయి.

Viral Video: గాల్లో విమానంలోనే పొట్టు పొట్టు కొట్టుకున్న ప్రయాణీకులు!
Viral Video: గాల్లో విమానంలోనే పొట్టు పొట్టు కొట్టుకున్న ప్రయాణీకులు!

సెప్టెంబర్ 17న జరిగినట్లు భావిస్తున్న ఈ ఘటనలో 'ఫస్ట్ మార్గాక్స్' అనే భారీ నౌక, 'లుకింగ్ యువాన్యు 108' అనే చేపల వేట పడవ ఒకే సమయంలో సమీపంలోని లంగరు ప్రాంతాల నుంచి బయలుదేరినట్లు సమాచారం. అనంతరం రెండు నౌకలు సింగపూర్ జలసంధిలోని ట్రాఫిక్ సెపరేషన్ స్కీమ్‌లోకి ప్రవేశించినట్లు షిప్-ట్రాకింగ్ డేటా ఆధారంగా తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన వీడియోలో భారీ నౌక వేగంగా చేపల పడవ వైపు దూసుకొచ్చి ఢీకొట్టడం స్పష్టంగా కనిపిస్తోంది. ఢీకొన్న వెంటనే చేపల పడవ ఒక్కసారిగా ఒరిగిపోగా.. సముద్రపు నీరు దాని డైక్ పైకి భారీగా ప్రవహించింది. అక్కడున్న సిబ్బంది పడవలోని వస్తువులను పట్టుకుని నిలబడేందుకు ప్రయత్నించినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఢీకొన్న కొద్దిసేపటికే వీడియో ముగిసింది.

Viral Video Giant Ship Collides with Chinese Fishing Boat Near Singapore Strait all crew members survived

కెమెరాలో క్లియర్‌గా కనిపించిన ప్రమాద దృశ్యాలు
చేపల వేట పడవలో ఉన్న వారి వైపు నుంచి చిత్రీకరించిన ఈ వీడియో సముద్రంలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో స్పష్టం చేస్తోంది. ఓ భారీ ఓడ, వేగంగా తమ వైపు దూసుకొచ్చి పడవను ఢీకొట్టడంతో ఆ చిన్న పడవ ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది. డెక్ అంతటా నీరు ఉవ్వెత్తున ఎగిసిపడగా.. ప్రమాదం నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు పడవలోని సిబ్బంది ఆందోళనతో పడవ భాగాలను గట్టిగా పట్టుకుని ఉండడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

మరో 10 రోజుల్లో రుతుపవనాలు ఖతం! శాటిలైట్ చిత్రాలతో ఐఎండీ షాకింగ్ రిపోర్ట్
మరో 10 రోజుల్లో రుతుపవనాలు ఖతం! శాటిలైట్ చిత్రాలతో ఐఎండీ షాకింగ్ రిపోర్ట్

ఒకే సమయంలో పయనం
'ది మారిటైమ్ ఎగ్జిక్యూటివ్' నివేదిక, పొల్ స్టార్ గ్లోబల్ అందించిన ఏఐఎస్ షిప్-ట్రాకింగ్ డేటా ప్రకారం.. ఈ రెండు నౌకలు సింగపూర్ సమీపంలోని లంగరు స్థానాల నుంచి ఒకే సమయంలో బయలుదేరాయి. జలసంధి గుండా సురక్షితంగా వెళ్లేందుకు కేటాయించిన 'ట్రాఫిక్ సెపరేషన్ స్కీమ్' అనే షిప్పింగ్ ఛానల్లోకి రెండూ ప్రవేశించిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది.

సిబ్బంది సురక్షితం
అత్యంత ప్రమాదకర రీతిలో ఢీకొన్నప్పటికీ.. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం కానీ, సిబ్బందికి గాయాలు కానీ సంభవించలేదు. ఏఐఎస్ ట్రాకింగ్ సిగ్నల్స్ ప్రకారం.. చేపల పడవ సముద్రంలో మునిగిపోకుండా నీటిపైనే తేలుతూ సురక్షితంగా ఓ రేవును చేరుకోగలిగింది. ప్రమాదానికి గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని, అధికారులు దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+