వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోదావరి జలాల సద్వినియోగం Home Full Story

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌: గోదావరి జలాలసద్వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనిఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుప్రకటించారు. వరంగల్‌ జిల్లా ఏటూరు నాగరంమండలంలోని దేవాదుల వద్ద శనివారం నాడుగోదావరిపై నిర్మించతలపెట్టిన మెగా ఎత్తిపోతల ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి శంకుస్థాపనచేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, అంతర్జాతీయ సాంకేతిక ప్రమాణాలతో ఈ భారీ ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రభుత్వం నిర్మిస్తున్నదని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రాజెక్టు శంకుస్థాపనకోసం కేంద్రమంత్రులు, ఇతర ప్రముఖులతో కలసి హెలికాప్టర్‌లో వచ్చిన ముఖ్యమంత్రికి స్థానిక గిరిజనులు ఘనంగా స్వాగతం చెప్పారు. ప్రాజెక్టు ప్రాంతానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో పెద్దఎత్తున జనాలను అధికారులు సమీకరించలేకపోయారు. శంకుస్థాపన తర్వాత గోదావరి తీరంలోనే ముఖ్యమంత్రి చెట్టుకింద కూర్చొని విలేకరులతో మాట్లాడారు.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సర్వే పనులు అయిదునెలల్లో పూర్తకాగలవని ప్రాజెక్టును అయిదేళ్ల కాలంలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. వరంగల్‌, కరీంనగర్‌, నల్లగొండ, మెదక్‌ జిల్లాల్లో అయిదు లక్షల ఎకరాలకు ఈ ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందుతుందని ముఖ్యమంత్రి తెలియజేశారు. ముఖ్యమంత్రితో పాటు ఈ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్‌రావు నల్లగొండ, కరీంనగర్‌, వరంగల్‌ ఎంపీలు, రాష్ట్ర మంత్రులు అశోక్‌గజపతిరాజు, దేవేందర్‌గౌడ్‌, తుమ్మల తదితరులు కూడా పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X