వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరని అగ్నిగుండం మణిపూర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ఇంఫాల్‌ః మణిపూర్‌ లో సోమవారం ప్రారంభమైన హింసాకాండ ఇంకా కొనసాగుతునే వున్నది. కేంద్ర ప్రభుత్వ కర్ఫ్యూ విధించినప్పటికీ ప్రజలు ఆంక్షలను త్రోసిరాజని విధ్వంసం సృష్టిస్తున్నారు. మూడు జిల్లాలలో ఆగ్రహోదగ్రులైన ప్రజలు మారణహోమం సృష్టించనట్లు సమాచారంఅందింది. పలువురు రాజకీయ నేతల ఇళ్ళపై కూడా అల్లరిమూకలు దాడులు చేశారు. దీనితో రాష్ట్రంలోని బడా నేతలకు భారీ భద్రత కల్పించారు.

కేంద్రం నుంచి పెద్ద సంఖ్యలో బలగాలను మణిపూర్‌ లోని సున్నిత ప్రాంతాలకు తరలించారు. మంగళవారం అల్లరిమూకలు జరపిన దాడిలో ఒక కానిస్టేబుల్‌ మరణించాడు. కేంద్ర ప్రభుత్వం మణిపూర్‌ ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగిస్తుందనే భయంతో ప్రజలు ఈ మారణకాండ సాగిస్తున్నారు. నాగలాండ్‌ తీవ్రవాదులతో కాల్పులవిరమణ ఒప్పందాన్ని మణిపూర్‌ లో నాగాల ప్రాబల్యం వున్న ప్రాంతాలకు కూడా పొడిగిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపెను వివాదానికి దారితీసింది.

మంగళవారం కూడా మణిపూర్‌ లో కర్ఫ్యూ కొనసాగుతున్నది. మణిపూర్‌ ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించే చర్యలను కేంద్ర చేపట్టదని కేంద్ర హోం శాఖ మంత్రి అద్వానీ హామీ ఇచ్చారు.అసలు ఎవరికీ చెప్పా పెట్టకుండా ఎన్డీఏ ప్రభుత్వం నాగాలాండ్‌ లో కాల్పులవిరమణను మణిపూర్‌ కు విస్తరించిందని ఎన్డీఏ భాగస్వామి సమతాపార్టీవిమర్శించింది. మొత్తం మీద మణిపూర్‌ పరిణామాలతో ఎన్డీఏ ప్రభుత్వం ఇరకాటంలోపడింది.

  • మణిపూర్‌లో కాల్పులు:13మంది మృతి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X