పౌర హక్కుల నేత రాజీనామా
వరంగల్: ఆంధ్రప్రదేశ్‌పౌరహక్కుల సంఘం (ఎపిసిఎల్‌సి) వరంగల్ జిల్లా అధ్యక్షుడు అనంతులసురేష్ రాజీనామా చేశారు. అధ్యక్షపదవికి,సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లుఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తాను రాజీనామాచేయడం వెనుక ఎవరి ఒత్తిడి లేదని ఆయనఅన్నారు.
ఎపిసిఎల్‌సి పోకడలపై అయిష్టతతో, కుటుంబ సభ్యుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని మాత్రమేతాను రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు.కాగా, సురేష్‌ను పోలీసులు అరెస్టు చేశారని మానవహక్కుల వేదిక వరంగల్ జిల్లా నాయకుడు బుర్రా రాములు ఇటీవలప్రకటించారు. ఈ నేపథ్యంలో సురేష్ రాజీనామాచేయడం జిల్లా చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications