తెగని దేశం, బిజెపి చర్చలు
హైదరాబాద్: పంచాయతీరాజ్ సంస్థ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై తెలుగుదేశం, బిజెపిల మధ్య జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కి రాలేదు. సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి రావడానికి ఇంకా ఒకటి రెండు రోజులు పట్టవచ్చునని భావిస్తున్నారు. ఇంతకు ముందు ఎన్నికల్లో ఆరు జడ్‌పిటిసిలను గెల్చుకున్న బిజెపికి 50 జడ్‌పిటిసిల దాకా తెలుగుదేశం కేటాయించవచ్చునని అంటున్నారు. కొన్ని జిల్లాల్లో సర్దుబాటు సమస్యగా మారింది. ఈ జిల్లాల నాయకులతో తెలుగుదేశం, బిజెపిల సమన్వయ
కమిటీ నాయకులు చర్చలు జరుపుతున్నారు.
రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, కడపచ చిత్తూరు జిల్లాల్లో సీట్ల పంపకంపై ఇరు పార్టీల నాయకులు తమ పంతాలను వీడడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో బలం లేని బిజెపి ఎక్కువ సీట్లు అడగడం భావ్యం కాదని తెలుగుదేశం నాయకులు వాదిస్తుండగా పరిస్థితి ఇంతకు ముందటిలా లేదని బిజెపి నాయకులంటున్నారు.
తాము 30 శాతం సీట్లు అడుగుతున్నామని, తాము గెలవగలిగిన స్థానాలనే అడుగుతున్నామని బిజెపి నాయకుడు గంగుల ప్రతాప రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నిర్వీర్యమవుతోందని, అదే స్థాయిలో బిజెపి బలం పెరుగుతోందని ఆయన అంటున్నారు. పట్టణాల్లో బిజెపి ఎలా వుందో గ్రామీణ ప్రాంతాల్లో కూడా అదే స్ఫూర్తితో వున్నదని ఆయన అన్నారు. ఇప్పటి వరకు ఇరు పార్టీ నాయకులక మధ్య మూడు దఫాలు చర్చలు జరిగాయి.












Click it and Unblock the Notifications