BJP కి షాకిచ్చిన కాక్‌రోచ్ జనతా పార్టీ.. 4 రోజుల్లోనే అతి పెద్ద పార్టీగా రికార్డ్
భారతీయ రాజకీయాల్లో సరికొత్త రికార్డులు సృష్టించాలంటే దశాబ్దాల కాలం పడుతుంది. కానీ, డిజిటల్ ప్రపంచంలో ట్రెండ్ సెట్ చేయడానికి కేవలం కొన్ని గంటలు చాలని నిరూపిస్తోంది "కాక్‌రోచ్ జనతా పార్టీ" (CJP). ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త సంచలనంగా మారిన ఈ వ్యంగ్య (Satirical) ఆన్‌లైన్ పేజీ, కేవలం నాలుగే నాలుగు రోజుల్లో 9 మిలియన్ల (90 లక్షలు) ఫాలోవర్ల మార్కును దాటేసి అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా గుర్తింపు పొందిన భారతీయ జనతా పార్టీ (BJP) అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్యను సైతం ఇది దాటేయడం విశేషం.
ఈ ఖాతా సాధించిన వృద్ధిని చూస్తే సోషల్ మీడియా విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. మే 16న ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మొదలైన ఈ ట్రెండ్, మరుసటి రోజే @cockroachjantaparty పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టింది. అక్కడ కేవలం 78 గంటల్లోనే 3 మిలియన్ల మందిని ఆకర్షించింది. ఆ తర్వాత పరుగు లంకించుకుంటూ కేవలం 56 పోస్టులతోనే 9 మిలియన్ల మైలురాయిని దాటేసింది.

పెద్ద పెద్ద పార్టీలకే షాక్!
ప్రస్తుతం దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్యతో పోల్చి చూస్తే ఈ 'కాక్‌రోచ్' హవా ఏంటో స్పష్టమవుతుంది:
- కాంగ్రెస్ (@incindia): 13.2 మిలియన్లు
- కాక్‌రోచ్ జనతా పార్టీ (@cockroachjantaparty): 9+ మిలియన్లు
- బీజేపీ (@bjp4india): 8.7 మిలియన్లు
- ఆమ్ ఆద్మీ పార్టీ (@aamaadmiparty): 1.9 మిలియన్లు
గమనార్హం:
బీజేపీ తన పేజీలో ఇప్పటివరకు 18,000 కంటే ఎక్కువ పోస్టులు పెట్టి 8.7 మిలియన్ల ఫాలోవర్లను సంపాదిస్తే, ఈ వ్యంగ్య పేజీ కేవలం 56 పోస్టులతోనే ఆ మార్కును దాటేసి సరికొత్త రికార్డు సృష్టించింది.
ఇంతకీ ఈ ఉద్యమం వెనుక అసలు కథేంటి?
ఇదంతా మే 16న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన కొన్ని వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా, దేశంలోని యువత నడిపిస్తున్న ఒక డిజిటల్ నిరసన. "యువత కోసం, యువత ద్వారా, యువత నడిపే రాజకీయ వేదిక" అని తమ్ము తాము అభివర్ణించుకుంటున్న ఈ పేజీ కేవలం జోకులకే పరిమితం కాలేదు. యువతను వేధిస్తున్న నిరుద్యోగం, రాజకీయ జవాబుదారీతనం లోపించడం, పేపర్ లీక్ వివాదాలు వంటి తీవ్రమైన అంశాలను వ్యంగ్యాస్త్రాలుగా మలిచి పదునైన పోస్టులు పెడుతుండటంతో యువత దీనికి బ్రహ్మరథం పడుతోంది.
బీజేపీ ఫాలోవర్ల సంఖ్యను అధిగమించిన తరుణంలో ఈ పేజీ పెట్టిన పోస్టులు మరింత వైరల్ అవుతున్నాయి. "యువశక్తిని తక్కువ అంచనా వేయకండి" అని హెచ్చరిస్తూనే, "ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అన్నారు కదా?" అంటూ బీజేపీ సంస్థాగత బలాన్ని నెటిజన్లు ఫన్నీగా వెక్కిరిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లోనే కాకుండా 'ఎక్స్' వేదికగా కూడా మే 21 నాటికి ఈ ఖాతా 165.5K ఫాలోవర్లతో దూసుకుపోతోంది.
140 మిలియన్లకు పైగా సభ్యులతో, ప్రధాని మోదీ నాయకత్వంలో వరుసగా మూడోసారి కేంద్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీ లాంటి భారీ పార్టీని.. కేవలం డిజిటల్ మీమ్స్‌తో, అదీ కొద్ది రోజుల్లోనే ఒక 'కాక్‌రోచ్' పేజీ దాటేయడం ఇప్పుడు భారత నెటిజన్లలో హాట్ టాపిక్‌గా మారింది.














Click it and Unblock the Notifications