చిత్తూరు స్టైల్ 'చామగడ్డ పులుసు'.. ఇలా చేస్తే టేస్ట్ సూపర్ అంతే..!

సాధారణంగా చామగడ్డను ఎక్కువమంది తినడానికి ఇష్టపడరు. ఎప్పుడైనా తినాల్సి వస్తే చామగడ్డ పులుసు తయారు చేసుకుని తింటారు. అయితే చామగడ్డ జిగురుగా ఉంటుంది కాబట్టి చాలామందికి రుచి కుదరదు. అయితే జిగురు లేకుండా చామగడ్డ పులుసును చిత్తూరు స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? ఇంట్లోనే తక్కువ పదార్థాలతో ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి..? ఇక్కడ చూద్దాం..

చిత్తూరు స్టైల్ 'చామగడ్డ పులుసు' తయారీకి కావాల్సిన పదార్థాలు చామగడ్డలు 500 గ్రాములు, చింతపండు నిమ్మకాయ సైజ్ లో, ఉల్లిపాయలు రెండు తరిగినవి, టమాటోలు రెండు తరిగినవి, పచ్చిమిర్చి నాలుగు, కారం రెండు స్పూన్ లు, పసుపు అర టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, బెల్లం కొద్దిగా, తాలింపు దినుసులు ఒక స్పూన్, నూనె మూడు టేబుల్ స్పూన్ లు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు రెండు రెబ్బలు, నీళ్లు మూడు కప్పులు తీసుకోవాలి.

ChamagaddaPulusu Chittoor Style Delicious Curry with Few Ingredients and Easy Cooking Method recipe

ఇప్పుడు చామగడ్డ పులుసు తయారీ విధానం చూస్తే.. ముందుగా చామగడ్డలను ఉడికించి పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత బాండీలో నూనె వేడి చేసి తాలింపు పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చితో తాలింపు చేయాలి. ఆ తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు టమాటో ముక్కలు, చింతపండు పులుసు, ఉప్పు, కారం, పసుపు, బెల్లం, నీళ్లు పోసి మరిగించుకోవాలి. అలా పులుసు ఉడికిన తర్వాత అందులో చామగడ్డ ముక్కలు వేసి 10-12 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర చల్లుకోవాలి. అంతే సూపర్ టేస్టీ చిత్తూర్ స్టైల్ చామగడ్డ పులుసు రెడీ అయినట్టే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+