రైతులకోసం ఐటి డేటాబేస్
న్యూఢిల్లీ:రైతులకు ప్రయోజనకరంగా వుండే విస్తృతమైన డేటాబాంక్‌ను భారత్ రూపొందిస్తున్నది. వ్యవసాయానికి సంబంధించిన సమస్త సమాచారంతో డెవలప్‌చేస్తున్న ఆగ్రో క్లైమాటిక్ ఇన్ఫర్మేషన్ బాంక్ కోసం ఐటి రంగంలో అంతరిక్షంలో తన పరిజ్ఞానాన్ని భారత్ పూర్తిగా వినియోగించింది.
తొలుత ప్రయోగాత్మకంగా దీనిని కర్ణాటకలోని మూడు జిల్లాల్లో దీనిని వినియోగంలోకి తెస్తున్నారు. భూసారం స్థితిగతులను, ఏ భౌగోళిక పరిస్థితులకు ఏ పంటలు సరిపోతాయి, తెగుళ్లు, రసాయనాలు, క్రిమి సంహారకాలు, వంటి సమస్త సమాచారం ఈ బాంక్‌లో వుంది. అత్యంత కీలకమైన వాతావరణ సమాచారం కూడా ఈ బాంక్ అందజేస్తుంది. వ్యవసాయరంగానికి అవసరమైన సమాచారం కావాలనుకునే వారు ఇప్పుడు వేరువేరు సోర్స్‌నుంచి సమాచారాన్నిసేకరించాల్సివస్తున్నది.
కాగా ఈ బేంక్‌వల్ల ఒకే చోటునుంచి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. ఈ డేటా బాంక్‌నుంచి సమాచారాన్ని ఏవిధంగా పొందాలో 150 మంది అధికారులకు శిక్షణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications