నామినేషన్ల పర్వం ప్రారంభం
హైదరాబాద్: జెపిటిసి, ఎంపిటిసి ఎన్నికల నామినేషన్ల ఘట్టం బుధవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమైంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ వివిధ పార్టీల అభ్యర్ధులు అనుచరులు, బంధువులు వెంటరాగా అట్టహాసంగా వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు.
పొత్తు కోసం జరుగుతున్నా పొత్తు దారిపోత్తుదే అన్నట్టుగా ముందైతే నామినేషన్లు వేద్దామన్న ఆతృత అభ్యర్దుల్లో కనిపించింది. అనేక జిల్లాల్లో బిజెపి-తెలుగుదేశం పొత్తు చర్చలు ఫలించకపోవడంతో రెండు పార్టీల అభ్యర్ధులు ఎవరితోవన వారు నామినేషన్ దాఖలు చేశారు. కర్నూలు జిల్లాల్లో పెద్దసంఖ్యలో తెలుగుదేశం అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేశారు. ఖరారైన అభ్యర్ధులు బి ఫారమ్‌లు అందకున్న వెళ్లి నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.
వరంగల్ జిల్లాలో, గోదావరి జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో కూడా పెద్ద సంఖ్యలోనే నామినేషన్లు దాఖలయ్యాయి. గుంటూరులో మాత్రం బిజెపి-దేశం మధ్య పొత్తు సయోధ్యతో కుదిరినట్టుగా తెలిసింది. నామినేషన్ల దాఖలుకు గడువు మరో రెండు రోజులు వుండటంతో ఆసక్తి వున్న అభ్యర్ధులు పార్టీల ఆమోదంతో ప్రమేయం లేకుండా ముందుగా నామినేషన్లు వేస్తున్నారు.












Click it and Unblock the Notifications