బయోఇన్ఫర్మాటిక్స్‌లో ఒబిఎస్ కోర్సులు
హైదరాబాద్:ఒసిమమ్ బయోసొల్యూషన్స్ ఇండియాలోనే తొలిసారిగా బయోఇన్ఫర్మాటిక్స్‌లో సర్టిఫికెట్ కోర్సులను ప్రవేశపెట్టింది. ఐటిలోనూ సైన్స్‌లోనూ స్పెషలైజ్‌చేసి బయోటెక్నాలజీ రంగంలో పనిచేయడానికి ఆసక్తివున్న అభ్యర్ధుల అవసరాలకుఅనుగుణంగా ఈ కోర్సులకు రూపకల్పన చేసినట్టు సంస్థ వెల్లడించింది.
బయో ఇన్ఫర్మాటిక్స్‌లో 16 వారాల కోర్సును, డిఎన్‌ఎ అండ్ ప్రొటీన్ సీక్వెన్స్ అనాల్సిస్‌లో 12 వారాల సర్టిఫికెట్ కోర్సును ప్రారంభిస్తున్నట్టుఒసిమమ్ బయోసొల్యూషన్స్ వెల్లడించింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నఒసియమ్ బయో సొల్యూషన్స్ ఇండియా సంస్థనుఅమెరికాకు చెందిన సరకా గ్రూప్ సంస్థఒసిమమ్ బయోసొల్యూషన్స్ ఐఎన్‌సి. ప్రమోట్ చేసింది.
బయోఇన్ఫర్మాటిక్స్‌లో సర్టిఫికెట్ కోర్సు వల్ల జెనోమిక్స్, డిఎన్‌ఎ సీక్వెన్సింగ్ అనాల్సిస్, ఫంక్షనల్ బయో ఇన్ఫర్మాటిక్స్‌లో తగినంత పరిజ్ఞానంతో పాటు పరిశ్రమ ప్రామాణికంగా భావించే టూల్స్ వినియోగం పై పట్టుకూడా లభిస్తుంది.
శరవేగంతో అభివృద్ధి చెందుతూ ఆధునిక ఆర్ధిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్న బయోటెక్ రంగంలో కంప్యూటర్ అప్లికేషన్లను సరళతరం చేసేందుకు బయోఇన్ఫర్మాటిక్స్ ఉపకరిస్తుంది. బయోలజీ, కెమిస్ట్రీ మొదలు, కంప్యూటర్‌సైన్స్, మాథ్స్ చదువుకున్న వారికి కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా వుంటుంది.
మరిన్ని వివరాలకు.......












Click it and Unblock the Notifications