కాంగ్రెస్‌తో కమ్యూనిస్టుల అవగాహన Home Full Story
హైదరాబాద్: పంచాయతీరాజ్ ఎన్నికల్లో తెలుగుదేశం, బిజెపిల కూటమిని ఓడించేందుకు ఉమ్మడిగా పని చేయాలని కాంగ్రెస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఒక అవగాహనకు వచ్చాయి. తెలుగుదేశం ప్రభుత్వ ఓట్లు చీలిపోకుండా స్థానికంగా తమ పార్టీల బలబలాలను బట్టి సీట్ల సర్దుబాటుకు రావాలని అంగీకారానికి వచ్చాయి. ఉమ్మడి శత్రువును ఓడించేందుకు అవసరమైతే పార్టీ క్యాడర్ త్యాగాలకు సిద్ధం కావాలని, సీట్ల పంపిణీలో పట్టువిడుపు ధోరణులు అవలంభించాలని నిర్ణయించారు.
రాష్ట్ర స్థాయిలో మంగళవారం ఇక్కడ జరిగిన సమావేశంలో పిసిసి అధ్యక్షుడు ఎం. సత్యనారాయణరావు, సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, సిపిఎం నాయకుడు కొరటాల సత్యనారాయణ పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో సీట్ల సర్దుబాటు గురించి ఇప్పటికే డిసిసి అధ్యక్షులకు సూచనలు ఇచ్చామని పిసిసి అధ్యక్షుడు ఎం. సత్యనారాయణరావు చెప్పారు. సీట్ల సర్దుబాటు జడ్‌పిటిసిలకే కాకుండా ఎంపిటిసిలకు కూడా వర్తిస్తుందని ఆయన అన్నారు. సీట్ల సర్దుబాట్లు జిల్లా స్థాయి్‌లోనే జరుగుతాయని ఆయన చెప్పారు. రాబోయే ప్రతి ఎన్నికల్లో కమ్యూనిస్టులతో తాము అవగాహన కుదుర్చుకుంటామని, రాష్ట్ర రాజకీయాల్లో ఇదొక ముందంజ అని ఆయన అన్నారు.
xపరస్పర పోటీని నివారించడం కోసం అవగాహనకు వచ్చాము తప్ప కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోలేదని వామపక్షాలు చెబుతున్నాయి. . టిఆర్‌ఎస్ వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయే అవకాశం వుందని సిపిఎం నేత రాఘవులు చెప్పారు.












Click it and Unblock the Notifications