వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అట్టుడుకుతున్న తమిళనాడు

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నయ్‌ః తమిళనాట తుపాను ముందటి ప్రశాంతత నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధినిఅరెస్టుతో తమిళనాడుతో తీవ్ర ఉద్రిక్తత నెలకొని వుంది. ముఖ్యంగా కరుణనుఅరెస్టు చేసిన తీరుతో తమిళప్రజలంతా నిర్ఘాంతపోయారు.

తమిళనాడు అట్టుడుకుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా పోలీసు బలగాలను మొహరించినప్పటికీ పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. పోలీసులు పెద్దఎత్తున లాఠీచార్జీ చేశారు. కొన్ని చోట్ల కాల్పులు కూడా జరిగాయి. కడలూరు జిల్లాలో డిఎంకె అభిమాని ఒకరు కరుణానిధి అరెస్టుకు నిరసనగా ఆత్మాహుతి ప్రయత్నం చేసుకున్నారు. కరుణానిధి అరెస్టుకు నిరసనగా డిఎంకె ఇచ్చిన బంద్‌ పిలుపుతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో బంద్‌ జరిగింది. కాగా కరుణానిధిని నిర్బంధించిన సెంట్రల్‌జైలు ఎదురుగా నిరసన ప్రదర్శన జరుపుతున్న ప్రజలపై పోలీసులు లాఠీ చార్జీ చేసి జనాన్ని చితక్కొట్టారు.

డిఎంకె ప్రధానకార్యాలయంపై సాయుధ పోలీసులు దాడి చేసి
కార్యాలయంలో వున్న కార్యకర్తలను కూడా కొట్టారు. కొందరు కార్యకర్తలను కొట్టుకుంటూ పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. కరుణానిధి అరెస్టుకు సంబంధించిన దృశ్యాలను ప్రసారం చేస్తున్న సన్‌ టివిని ఈ ప్రసారాలు నిలిపివేయాల్సిందిగా పోలీసులు తీవ్రంగా హెచ్చరించారు. లేనిపక్షంలో తీవ్రమైన చర్యతప్పదని చెన్నై పోలీసు కమిషనర్‌ సన్‌టీవీ యాజమాన్యాన్ని హెచ్చరించారు. సన్‌టివి ఎండిని కూడా అరెస్టు చేయనున్నట్టుగా పోలీసులు తెలిపారు.

పరిస్థితి అదుపులోనే వున్నప్పటికీ ఏ క్షణంలో ఏంజరుగుతుందో అన్న భయం ప్రజల్లో వ్యాపించింది. జయలలిత కక్షసాధింపు చర్యలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. అవినీతిపరులపై చర్య తీసుకోవడం సరైనదే అయినప్పటికీ కరుణానిధి విషయంలో జయలలిత ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రజలు దుయ్యబడుతున్నారు.

డి.ఎం.కె. పట్టు వున్న ప్రాంతాలలో భారీ ఎత్తుల పోలీసు బలగాలను మొహరించారు. కొన్ని చోట్ల బస్సులపై రాళ్ళురువ్వినట్లు సమాచారం అందింది. డిఎంకె కార్యకర్తగా అనుమానం వస్తే చాలు.... పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. డిఎంకె పార్టీకి చెందిన కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి మురసోలి మారన్‌ కు చెందిన సన్‌ టివిపై దాడికి కొందరు అన్నాడిఎంకె కార్యకర్తలు ప్రయత్నించిట్లు సమాచారంఅందింది. కొందరు విలేకరులపై కూడా పోలీసు చేయి చేసుకున్నట్లు సమాచారంఅందింది.

పాండిచ్చేరిలో ఉద్రిక్తత
డిఎంకె నేత అరెస్టు తో పాండి చ్చేరి లో కూడా తీవ్రఉద్రిక్తత నెలకొంది. ప్రతిపక్షాలు పాండిచ్చేరి బంద్‌ కు పిలుపునిచ్చాయి. హింసాత్మక సంఘటనలకు దిగితే సహించేది లేదని పాండిచ్చేరి ముఖ్యమంత్రి షణ్ముగం ప్రతిపక్షాలను హెచ్చరించారు.

  • కేంద్రం సీరియస్‌
  • ఇద్దరు కేంద్రమంత్రుల అరెస్టు
  • జెలులో కరుణ సత్యాగ్రహం
  • కరుణానిధి అరెస్టుః జైలుకు తరలింపు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X