IPL 2026: SRH ఘన విజయం.. అయినా దక్కని క్వాలిఫయర్ అవకాశం!

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) మరో భారీ విజయాన్నందుకుంది. కానీ టాప్-2 బెర్త్‌ను అందుకోలేకపోయింది. శుక్రవారం ఉప్పల్ మైదానం వేదికగా జరిగిన హైస్కోరింగ్ గేమ్‌లో సమష్టిగా రాణించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 55 పరుగుల భారీ తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)ని చిత్తు చేసింది.

ఈ గెలుపుతో మొత్తం 9 విజయాలతో 18 పాయింట్లతో లీగ్ దశను ముగించింది. కానీ పేలవ రన్‌రేట్ కారణంగా టాప్-2 ప్లేస్‌ను దక్కించుకోలేక మూడో స్థానానికి పరిమితమైంది. తద్వారా తృటిలో క్వాలిఫయర్-1 ఆడే అవకాశాన్ని కోల్పోయింది. దాంతో ఈ మ్యాచ్ గెలిచినా సన్‌రైజర్స్ ఆటగాళ్లతో పాటు అభిమానులకు ఆనందం లేకుండా పోయింది.

35 పరుగుల దూరంలో..

టేబుల్ టాపర్ ఆర్‌సీబీ, రన్నరప్ గుజరాత్ టైటాన్స్‌‌లు క్వాలిఫయర్‌-1కు అర్హత సాధించాయి. 90 పరుగుల తేడాతో ఆర్‌సీబీని ఓడించి ఉంటే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు టాప్-2 ప్లేస్ దక్కేది. కానీ 35 పరుగుల దూరంలో ఈ బెర్త్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ చేజార్చుకుంది.

256 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆర్‌సీబీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 200 పరుగులే చేసి ఓటమిపాలైంది. కెప్టెన్ రజత్ పాటిదార్(39 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 56) హాఫ్ సెంచరీతో రాణించగా.. వెకంటేశ్ అయ్యర్(19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 44), కృనాల్ పాండ్యా(31 బంతుల్లో 5 ఫోర్లతో 41 నాటౌట్) పర్వాలేదనిపించారు. విరాట్ కోహ్లీ(15), దేవదత్ పడిక్కల్(21) నిరాశపర్చారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఇషాన్ మలింగా(2/33) రెండు వికెట్లు తీయగా.. సాకిబ్ హుస్సేన్, ట్రావిస్ హెడ్‌లకు తలో వికెట్ దక్కింది.

IPL 2026 SRH Edge Out RCB in High-Scoring Thriller at Uppal But Miss Out on Qualifier 1 Spot via Net Run Rate


SRH బ్యాటర్ల ఊచకోత..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 255 పరుగుల భారీ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మ(22 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 56), ఇషాన్ కిషన్(46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 79), హెన్రీచ్ క్లాసెన్(24 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 51) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు.

నితీష్ కుమార్ రెడ్డి(12 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 29 నాటౌట్), ట్రావిస్ హెడ్(16 బంతుల్లో 5 ఫోర్లతో 26) దూకుడుగా ఆడారు. ఆర్‌సీబీ బౌలర్లలో రసీక్ సలామ్(2/55) రెండు వికెట్లు తీయగా.. సుయాష్ శర్మ(1/36), కృనాల్ పాండ్యా(1/24) చెరో వికెట్ పడగొట్టారు. ఆర్‌సీబీ ప్రధాన పేసర్లు భువనేశ్వర్ కుమార్(0/51), జోష్ హేజిల్ వుడ్(0/55) ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు.

కొంపముంచిన గుజరాత్..

అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 82 పరుగుల తేడాతో ఓటమిపాలవ్వడం సన్‌రైజర్స్ హైదరాబాద్ కొంపముంచింది. కాస్త ఓపికగా ఆడి ఈ మ్యాచ్‌లో మరో 35 పరుగులు చేసి ఉంటే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు టాప్-2 ప్లేస్ దక్కేది. 0.171 రన్ రేట్ తేడాతో సన్‌రైజర్స్ మూల్యం చెల్లించుకుంది. నాలుగో స్థానంలో నిలిచే జట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు ఇంటి బాట పట్టనుండగా.. గెలిచిన జట్టు క్వాలిఫయర్-1లో ఓడిన టీమ్‌తో క్వాలిఫయర్-2 ఆడుతుంది. క్వాలిఫయర్-1లో గెలిచే జట్టు నేరుగా ఫైనల్ చేరనుండగా.. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం లభిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+