కరుణను కలిసిన ఎర్రంనాయుడు
చెన్నయ్‌ః తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఎర్రం నాయుడు సోమవారం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని కలుసుకున్నారు. చెన్నయ్‌సెంట్రల్ జైలులో వున్న కరుణను ఎర్రం నాయుడు పరామర్శించారు. సుమారు 15 నిమిషాలసేపు ఎర్రం నాయుడు కరుణానిధితో చర్చించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తరపున తాను కరుణను పరామర్శించినట్లు ఎర్రంనాయుడు ఈ సందర్భంగావిలేకరులకు చెప్పారు.
డిఎంకెకు తెలుగుదేశం పార్టీ పూర్తి సంఘీభావాన్ని ప్రకటించిందని ఆయనవివరించారు. ఆర్టికల్ 365 కింద రాష్ట్రపతి పాలన విధించడాన్ని తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి వ్యతిరేకిస్తునే వున్నదని అయితే ప్రస్తుతం తమిళనాడు వ్యవహారం వేరని ఎర్రం నాయుడు చెప్పారు.
ఎర్రం నాయుడు మాటలను బట్టి తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించడాన్ని తెలుగుదేశం పార్టీ సమర్థించే అవకాశం వున్నదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
- మారన్, బాలు విడుదలకు గ్రీన్ సిగ్నల్
- గురువాయురప్పకు ఏనుగునిచ్చిన జయ
- 3న రంగరాజన్ ప్రమాణ స్వీకారం
- తమిళనాడు బంద్ ప్రశాంతం
- ప్రభుత్వంపై కఠిన చర్యకు జార్జి సిఫార్సు
- ఫాతిమాపై వేటు-రంగరాజన్ కు బాధ్యతలు
- రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిన జయః జార్జి
- నివేదిక పంపిన తమిళనాడు గవర్నర్
- కరుణను పరామర్శించిన జార్జి
- అట్టుడుకుతున్న తమిళనాడు
- జయలలితపై వాజ్ పేయి గరం
- జెలులో కరుణ సత్యాగ్రహం
- కరుణానిధి అరెస్టుః జైలుకు తరలింపు












Click it and Unblock the Notifications