గురువాయురప్పకు ఏనుగునిచ్చిన జయ
తిరువనంతపురంః తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సోమవారం గురువాయూర్ సందర్శించారు. గురువాయురప్పకు ప్రత్యేక పూజలు నిర్వహించిస్వామికి ఒక ఏనుగును సమర్పించారు.
జయలలిత గురువాయూర్ వచ్చిన సందర్భంగా జరిగిన లాఠీఛార్జీలో 36 మంది గాయపడ్డారు. గురువాయూరప్పను సందర్శించి, మొక్కు చెల్లించుకొనేందుకు జయలలిత సోమవారం ఇక్కడకు వచ్చారు. అయితే డిఎంకె నేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిఅరెస్టుకు నిరసనగా బిజెవైఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.
జయలలితను గుడిలోకి వెళ్ళకుండా అడ్డుకున్నారు. దీనితో పోలీసుల రంగంలోకి దిగి లాఠీ ఛార్జీ జరిపారు ఈ లాఠీ ఛార్జీలో 36 మంది కార్యకర్తలు గాయపడ్డారు. ఆ తరువాత జయలలిత గురువాయురప్పను సందర్శించి పూజలు నిర్వహించారు. గతంలో మొక్కుకున్న విధంగా జయలలిత గురువాయురప్పకు ఏనుగను బహూకరించారు.
జయలలిత వైఖరిపై ఒకవైపు కేంద్ర సర్కార్ మొదలుకొనిఅంతా తలలు బాదుకుంటుండగా ఆమె ప్రశాంతంగా గురువాయూర్ సందర్శనకు వెళ్ళడంవిశేషం.
- మారన్, బాలు విడుదలకు గ్రీన్ సిగ్నల్
- 3న రంగరాజన్ ప్రమాణ స్వీకారం
- తమిళనాడు బంద్ ప్రశాంతం
- ప్రభుత్వంపై కఠిన చర్యకు జార్జి సిఫార్సు
- ఫాతిమాపై వేటు-రంగరాజన్ కు బాధ్యతలు
- రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిన జయః జార్జి
- నివేదిక పంపిన తమిళనాడు గవర్నర్
- కరుణను పరామర్శించిన జార్జి
- అట్టుడుకుతున్న తమిళనాడు
- జయలలితపై వాజ్ పేయి గరం
- జెలులో కరుణ సత్యాగ్రహం
- కరుణానిధి అరెస్టుః జైలుకు తరలింపు












Click it and Unblock the Notifications