తూెర్పు గోదావరికి అల్లూరి పేరు
హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లాకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టే విషయం రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నదని హోం శాఖ మంత్రి దేవేందర్‌గౌడ్ తెలిపారు. అల్లూరి 104వ జయంతి సందర్భంగా రాష్ట్ర మంత్రులు దేవేందర్‌గౌడ్, కృష్ణాయాదవ్, విజయరామారావు టాంక్‌బండ్‌పై వున్న అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మంత్రులుతో పాటు పలువురు పురప్రముఖులు, ప్రజాసంఘాల నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అల్లూరి ఘనంగా నివాళులర్పించారు. దేశస్వాతంత్ర్యం కోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసిన అల్లూరిసీతారామరాజు వంటి మహానాయకుల త్యాగాలు ఫలించాలంటే అభివృద్ధి ఫలాలు పేదలకు అందాలని దేవేందర్ గౌడ్ అన్నారు. త్యాగమూర్తుల సేవలకు ఆరోజే పరమార్ధం సిద్ధిస్తుందని ఆయన అన్నారు. అల్లూరి వంటి నేతల త్యాగం నేటి యువతరానికి స్ఫూర్తి దాయకమని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications