సచిన్ సెంచరీ-భారత్ జయభేరి
హరారేః వెస్టిండీస్ తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ లో కూడా భారత్ జయభేరి మోగించింది. బ్యాటింగ్ సంచలనం సచిన్ వన్డే కెరీర్ లో 29వసెంచరీ నమోదు చేసుకున్నాడు. గంగూలీ కూడా చెప్పుకోతగ్గ విధంగా పరుగులు చేయడంతో భారత్ సునాయాసంగా వెస్టిండీస్ పైవిజయం సాధించింది. ట్రయాంగ్యులర్ సిరీస్ లో నాలుగు మ్యాచ్ లు గెలిచిన భారత్ 7న జరిగేఫైనల్ లో వెస్టిండిస్ తోనే తలపడుతుంది.
తొలుత టాస్ గెలిచి గంగూలీ బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్ బౌలర్లు బాగా బౌలింగ్ చేయడంతో వెస్టిండీస్ ఐదువికెట్లు కోల్పోయి 50 ఓవర్లలో 229 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఓపెనర్లు గట్టి పునాది వేశారు. గంగూలీ 64 పరుగులు, సచిన్ 122 పరుగులు చేసి భారత్ కు సునాయాసవిజయం అందించారు. సచిన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నారు.












Click it and Unblock the Notifications