తెలుగులో వైర్‌లెస్ కంటెంట్
హైదరాబాద్: తెలుగుతో సహా 12 భారతీయ భాషల్లో వైర్‌లెస్ కంటెంట్‌ను అందించే సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ను హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ సంస్థ విజువల్ క్వెస్ట్ అభివృద్ధి చేసింది. విజువల్ స్క్రిప్ట్ పేరుతో మార్కెట్‌లోకి తేనున్న ఈ కంటెంట్ మానేజ్‌మెంట్ అప్లికేషన్ వల్ల మొబైల్ ఫోన్లలో ప్రాంతీయ భాషల్లో కంటెంట్ అందించడానికి వీలుపడుతుంది.
దీనివల్ల వైర్‌లెస్ కంటెంట్ విషయంలో ఇప్పటివరకు కొనసాగుతున్న ఇంగ్లీష్ గుత్తాధిపత్యానికి స్వస్తి చెప్పవచ్చు. తాము డెవలప్ చేసిన సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ వల్ల 12 భారతీయ భాషలతో పాటు 4 అంతర్జాతీయ భాషల్లో కూడా కంటెంట్‌నువైర్‌లెస్ ఇన్‌స్ట్రుమెంట్స్‌కు అందజేయగలదనివిజువల్‌క్వెస్ట్ ప్రకటించింది.












Click it and Unblock the Notifications