నక్సలైట్ల పోరాటం దేనికోసంః బాబు
కరీంనగర్‌ః గ్రామీణాభ్యుదయ సాధన కోసం నక్సలైట్లు ప్రభుత్వానికి సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల ప్రచారపర్వంలో భాగంగా చంద్రబాబు నాయుడు గురువారం కరీంనగర్ జిల్లా జగిత్యాలలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. శాంతి భద్రతల సమస్య వున్న రాష్ట్రాలలో ఎవరూ పెట్టుబడులుపెట్టరని, ఫలితంగా రాష్ట్రం వెనుకబడిపోతుందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
పెత్తందారులపై కత్తికట్టి నక్సలైట్లు తుపాకీ చేత పట్టారని, అయితే పెత్తందారులంతా ఇప్పుటు పట్టణాలకు చేరి కోటీశ్వరులయ్యారని ఆయన అన్నారు నక్సలైట్లు ఇక ఎందుకోసం ఉద్యమం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. నక్సలైట్ల ఉద్యమాల వల్లపేదలు నిరుపేదలుగా మారుతున్నారని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి మరింత కుంటుబడి పోతున్నదని ఆయన అన్నారు.
నక్సలైట్లు జనజీనవ స్రవంతిలో కలిసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్, టి.ఆర్.ఎస్. పై చంద్రబాబువిమర్శనాస్త్రాలు సంధించారు. కేవలం అధికారం కోసం ఆ రెండు పార్టీలు ప్రజలకు కల్లబొల్లి వాగ్దానాలు చేస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ఆయనవిజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications