తిరుచ్చి బై పోల్ బరిలో స్టాలిన్, టీవీకే అభ్యర్ధిగా విజయ్ మార్క్ ఎంపిక- అగ్ని పరీక్ష..!?

తమిళనాడు రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. సీఎం విజయ్ పట్టు బిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో త్వరలో అయిదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీంతో, హామీల అమలు పైన విజయ్ ఫోకస్ చేసారు. అటు డీఎంకే- విజయ్ మధ్య పొలిటికల్ వార్ పీక్ కు చేరింది. ఈ క్రమంలో తానే బైపోల్ లో పోటీ అసెంబ్లీకి వెళ్లాలని స్టాలిన్ డిసైడ్ అయ్యారు. ఈ నిర్ణయం ఇప్పుడు విజయ్ కు అగ్ని పరీక్షగా మారుతోంది. తన పార్టీ అభ్యర్ధిని దాదాపు ఖరారు చేసారు. ఈ సమీకరణాలు ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతున్నాయి.

తమిళనాడులో అసెంబ్లీ ఉప ఎన్నికల సందడి మొదలైంది. విజయ్ వర్సస్ డీఎంకే పొలిటికల్ వార్ ఇప్పుడు ఈ బైపోల్స్ వేళ మరింత హీటెక్కుతోంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో విజయ్ రెండు స్థానాలు పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి గెలుపొంది, తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేయడంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానం నుంచి స్టాలిన్ పోటీ చేయటం దాదాపు ఖాయమైందని సమాచారం. సొంత నియోజకవర్గం కొళత్తూరులో ఓటమి పాలైన డీఎంకే అగ్రనేత ఎం.కె. స్టాలిన్, ఇప్పుడు తిరుచ్చి ఈస్ట్ నుంచి బరిలోకి దిగి అసెంబ్లీలో అడుగుపెట్టాలని భావిస్తున్నట్లుగా ప్రచారం. విజయ్ గెలుపు కేవలం సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రామ్ హైప్ వల్ల వచ్చిందే తప్ప, వారికి క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం కానీ, పాలనా దక్షత కానీ లేదు అంటూ స్టాలిన్ ఇప్పటికే టార్గెట్ చేస్తున్నారు.

నిర్మలమ్మ శాఖ మార్పు, ప్రధాన్ ఔట్- నితీశ్..చద్దా బాధ్యతలు ఫిక్స్, ఎవరికి ఏ శాఖ..!!
నిర్మలమ్మ శాఖ మార్పు, ప్రధాన్ ఔట్- నితీశ్..చద్దా బాధ్యతలు ఫిక్స్, ఎవరికి ఏ శాఖ..!!
dmk-chief-mk-stalin-likely-to-re-enter-tamil-nadu-assembly-through-trichy-east-bypoll-here-the-deta

స్టాలిన్ vs విజయ్.. ఇద్దరికీ అగ్ని పరీక్ష

స్టాలిన్ పైన ప్రజల్లో సానుభూతి కనిపిస్తోంది. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉండి, మొదటి సారిగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం స్టాలిన్‌పై ప్రజల్లో ఒక రకమైన సానుభూతిని కలిగించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గంలో విజయ్ భారీ మెజారిటీతో గెలిచారు. అయితే, ఇప్పుడు స్వయంగా మాజీ ముఖ్యమంత్రి రంగంలోకి దిగితే, అక్కడ గడ్డు పరిస్థితి ఎదురుకావడం ఖాయం. కాగా.. టీవీకే నుంచి ఇక్కడ అభ్యర్ధి విషయంలో విజయ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మాజీ ఐఏఎస్ అధికారి సగాయంకు టికెట్‌ కేటాయిస్తారనే సంకేతాలు అందుతున్నాయి. అవినీతి వ్యతిరేక పోరాటంతో తమిళనాడులో ప్రత్యేకంగా గుర్తింపు పొందిన సగాయం కు నిజాయితీ అధికారిగా పేరు ఉంది. దీంతో.. సగాయంను ఈ స్థానం నుండి బరిలోకి దింపాలని విజయ్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. తొలి సారి సీఎం అయిన తనకు పాలనా పరంగా సీనియర్ అధికారుల మద్దతు అవసరమని విజయ్ గుర్తించారు.
దీని ద్వారా ప్రజల్లో తన ఇమేజ్ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. దీంతో.. తిరుచ్చి తో పాటుగా మరో నాలుగు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు సీఎం విజయ్.. డీఎంకే, అన్నా డీఎంకే కు అగ్ని పరీక్షగా మారనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+