గ్రహణాన్ని కప్పేసిన కారుమబ్బులు
హైదరాబాద్‌ః గురువారం చంద్రగ్రహణం సంభవించింది. ఈ గ్రహణం భారత దేశంలో కనిపించింది. అయితే ఆంధ్ర రాష్ట్రంలో పలు ప్రాంతాలలో మాత్రం గ్రహణ దృశ్యాలు చూసేందుకు ప్రజలు నోచుకోలేదు. గురువారం సాయంత్రం కోస్తాజిల్లాలలతో పాటు తెలంగాణా జిల్లాలు, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కూడా భారీ వర్షం కురువడం, ఆ తరువాత కొన్ని ప్రాంతాలలో దట్టమైన మబ్బులు పట్టడంతో గ్రహణ దృశ్యాలు కనిపించలేదు.
దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు గ్రహణ దృశ్యాలను ఆసక్తిగా తిలకించారు. గురువారం రాత్రి 7.15 నిమిషాల నుంచి 9.50 నిమిషాల వరకు గ్రహణ దృశ్యాలు కనిపించాయి.
తిరుమల ఆలయం మూసివేత
గ్రహణం కారణంగా గురువారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి తిరుతిలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వున్న పలు ప్రధాన ఆలయాలను మూసి వేశారు. శుక్రవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం ఆలయ ద్వారాలను తిరిగి తెరుస్తారు. గ్రహణ సమయంలో ప్రజలు ఇళ్ళలోనే పలు పూజలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications