బెంగుళూరా? ఐటీ హంగులూరా?

బెంగుళూరుః బెంగుళూరు నగరాన్ని ఆసియాలోనే అతి పెద్ద ఐటి కేంద్రంగా అభివృద్ధి చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ పురాతన నగరానికి అత్యాధునిక హంగులు సమకూర్చే కాంట్రాక్టును కర్నాటక ప్రభుత్వం ఒక సింగపూరు కంపెనీకి అప్పగించింది. ఇందుకు 3,50,000 డాలర్లు ఖర్చవుతాయని అంచనా.

ఈ సింగపూరుకు చెందిన జెటిసి కన్సల్టెంట్స్‌ మాస్టర్‌ ప్లాను ఇస్తుందని, ఆస్ట్రేలియాకు చెందిన మరో కంపెనీ మంచినీటి సరఫరా, డ్రైనేజి వ్యవస్ధల ఆధునీకరణ ప్రణాళికను సూచిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు. వైట్‌ ఫీల్డ్‌ నుండి ఇంటర్నేషనల్‌ టెక్‌ పార్కు, ఎలక్ట్రానిక్స్‌ సిటీవరకు 23 కిలోమీటర్ల పరిధిలో ఈ మాస్టర్‌ ప్లాన్‌ ను అమలు చేయనున్నారు.

ఇప్పటికే 70 లక్షల జనాభాతో కిటకిటలాడుతున్న బెంగుళూరు మహానగరంలో అన్ని ప్రాధమిక సదుపాయాలతో ఆసియాలోనే మిన్నగా తీర్చిదిద్దడానికిదశల వారీగా ప్రణాళికలను రూపొందించినట్టు అధికారులు చెప్పారు. ఐటి కారిడార్‌ ను అభివృద్ధి చేస్తున్న నగరంలోని ఆగ్నేయ భాగంలో అంతర్జాతీయ ప్రమాణాలు గల రవాణా వ్యవస్ధను అభివృద్ధి చేయనున్నట్టు బెంగుళూరు డెవలప్‌ మెంట్‌
అథారిటీ కమిషనర్‌ జకీర్‌ జెరోమ్‌ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+