తెలంగాణ స్పెషల్ కరకరలాడే 'సర్వపిండి'.. అప్పటికప్పుడు ఇలా ఈజీగా చేసుకోండి..!
తెలంగాణ ప్రజలకు పరిచయం అక్కర్లేని పిండి వంటకాల్లో సర్వపిండి ఒకటి. దీన్ని ప్రాంతాన్ని బట్టి సర్వప్ప, గిన్నె పిండి, తపాలా చెక్క ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఓ వైపు వర్షం పడుతుంటే వేడివేడిగా సర్వపిండిని చేసుకుని నములుతుంటే మాటల్లో వర్ణించలేని అనుభూతి కలుగుతుంది. అయితే నేటి తరం మహిళలు సర్వపిండి చేయడంలో ఇబ్బందులు పడుతుంటారు. మరి వారికోసం ఇంట్లోనే సులభంగా నోరూరించే కరకరలాడే సర్వపిండిని ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..
తెలంగాణ స్పెషల్ కరకరలాడే 'సర్వపిండి' తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే ముందుగా బియ్యం పిండి రెండు కప్పులు, నానబెట్టిన శనగపప్పు మూడు టేబుల్ స్పూన్ లు, పల్లీలు దంచినవి రెండు టేబుల్ స్పూన్ లు, నువ్వులు రెండు టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఉప్పు, నూనె, గోరువెచ్చని నీళ్లు తీసుకోవాలి.

ఇప్పుడు తయారీ విధానం చూస్తే.. ముందుగా ఈ పదార్థాలన్నీ అంటే పిండి, పప్పులు, మసాలాలు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసి పిండిని మెత్తగా ముద్దలా చేసుకోవాలి. అలా కొద్దిసేపు పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెకు నూనె రాసి పిండిని పల్చగా ఒత్తాలి. ఆ తర్వాత రంధ్రాలు చేయడం స్టార్ట్ చేయాలి. రంధ్రాలు చేసి నూనె వేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి గిన్నెను తిప్పుతూ క్రిస్పీగా కాల్చుకోవాలి. అంతే కరకరలాడే సర్వపిండి వంటకం రెడీ అయినట్టే.. చల్లారిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే..












Click it and Unblock the Notifications