కరుణ కుమారుడు స్టాలిన్‌ విడుదల

చెన్నయ్‌ఃఫ్లైఓవర్ల కేసులో అరెస్టయిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడు, చెన్నయ్‌ మేయర్‌ స్టాలిన్‌ శుక్రవారం బెయిలుపై విడుదలయ్యారు.జూన్‌ 30 న స్టాలిన్‌ కోర్టులో లొంగిపోయిన విషయంవిదితమే. కరుణానిధితో పాటు కేంద్రమంత్రులు ఇద్దరినిఅరెస్టు చేయడంతో తనకు ప్రాణభయం వున్నదంటూ స్టాలిన్‌ లొంగిపోయారు.

ఫ్లైఓవర్‌ నిర్మాణం వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారంటూ స్టాలిన్‌ తో పాటు మరికొందరిపై కూడా ప్రభుత్వం కేసులుపెట్టింది. అయితే ఆ కేసులను సమర్థించుకోవడంలో సర్కార్‌ న్యాయవాది నీళ్ళు నమిలారు. కేవలంవిచారణ జరిపేందుకు చెన్నయ్‌ మేయర్‌ ను ఇన్నాళ్ళు జైలులోపెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని న్యాయమూర్తి ప్రభుత్వ లాయర్‌ ను నిలదీశారు. స్టాలిన్‌అరెస్టు చట్టవిరుద్ధమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

ఆస్పత్రిలో కరుణానిధిః
జయసర్కార్‌ అర్ధరాత్రి పూటఅరెస్టు చేసిన సందర్భంగా జరిగిన తోపులాటలో గాయపడడంతో పాటు, నాలుగు రోజుల పాటు ఆస్పత్రిలో వుండడంతో అనారోగ్యంపాలైన డిఎంకె అధినేత కరుణానిధి శుక్రవారంఅపోలో ఆస్పత్రిలో చేరారు. అరెస్టు సందర్భంగా జరిగిన తోపులాటలో కరుణానిధి భుజం బెణికింది. జైలులో బిపి అధికం కావడంతో పాటు కాళ్ళు వాచాయి. ఈ కారణాల దృష్ట్యా కరుణ ఆస్పత్రిలో చేరారని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు.

రంగరాజన్‌ తో జయ భేటీ
తమిళనాడు తాత్కాలిక గవర్నర్‌ గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ రంగరాజన్‌ ను తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత శుక్రవారం కలుసుకున్నారు.అరగంటకు పైగా జయ గవర్నర్‌ తో చర్చలు జరిపారు. చర్చలవివరాలను వెల్లడించేందుకు జయ నిరాకరించారు. రాజ్యాంగ నియమాలను అతక్రమించి ప్రవర్తించరాదంటూ కేంద్ర సర్కార్‌ జయకు హెచ్చరిక చేసిన దృష్ట్యా ఆమె గవర్నర్‌ ను కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.

  • కరుణానిధి హత్యకు కుట్ర
  • జయకు వార్నింగ్‌ తో సరిపెట్టిన కేంద్రం
  • జైలు నుంచి విడుదలైన కేంద్రమంత్రి
  • తమిళ పోలీసులకు కోర్టు చీవాట్లు
  • బెయిలు వద్దంటున్న కరుణానిధి
  • జయ ప్రభుత్వ రద్దుకు దేశం వ్యతిరేకం
  • రంగరాజన్‌ ప్రమాణ స్వీకారం
  • కరుణను కలిసిన ఎర్రంనాయుడు
  • గురువాయురప్పకు ఏనుగునిచ్చిన జయ
  • తమిళనాడు బంద్‌ ప్రశాంతం
  • ప్రభుత్వంపై కఠిన చర్యకు జార్జి సిఫార్సు
  • ఫాతిమాపై వేటు-రంగరాజన్‌ కు బాధ్యతలు
  • రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిన జయః జార్జి
  • నివేదిక పంపిన తమిళనాడు గవర్నర్‌
  • కరుణను పరామర్శించిన జార్జి
  • అట్టుడుకుతున్న తమిళనాడు
  • జయలలితపై వాజ్‌ పేయి గరం
  • జెలులో కరుణ సత్యాగ్రహం
  • కరుణానిధి అరెస్టుః జైలుకు తరలింపు
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+