మండల ఎన్నికలకుసన్నాహాలు
హైదరాబాద్:మండల పరిషత్‌ల అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకుఆదివారం ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలనిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లుచేసింది. ఎన్నికల ప్రక్రియ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుందని ఎన్నికలకమిషన్ కార్యదర్శి గార్గ్ శనివారం విలేకరులతోచెప్పారు.
మండల పరిషత్‌ప్రాదేశిక కమిటీల (ఎంపిటిసిల) సభ్యులుమండల అధ్యక్షులను, ఉపాధ్యక్షులను, కో ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకుంటారనిఆయన చెప్పారు. కోరం వుంటేనే ఎన్నికలుజరుగుతాయని ఆయన చెప్పారు. మండల పరిషత్‌కార్యాలయాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లుచేశారు.
మండల పరిషత్‌లఅధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను కైవసంచేసుకోవడానికి అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. పార్టీల మధ్య పొత్తులు,అవగాహనలు కుదురుతున్నాయి.












Click it and Unblock the Notifications