ఉత్కంఠ మధ్యమండల ఎన్నికలు
హైదరాబాద్:బేరసారాలు, రాజీలు, బెదిరింపుల మధ్య ఆదివారంరాష్ట్రంలో మండలాధ్యక్షుల ఎన్నికలుజరిగాయి. ఆదివారం సాయంత్రం ఐదు గంటల వరకుఅందిన ఫలితాల ప్రకారం తెలుగుదేశం పార్టీకి 193,కాంగ్రెస్‌కు 143, తెలంగాణా రాష్ట్ర సమితికి 31, సిపిఐకి 15, సిపిఎంకు 12మండలాలు దక్కాయి. మొత్తం 1094 మండలాలఅధ్యక్షుల, ఉపాధ్యక్షుల ఎన్నికలు జరగాల్సివుండగా 12 మండలాల్లో వివిధ కారణాల వల్ల ఎన్నికలువాయిదా పడ్డాయి.
రాష్ట్రంలోని 22జిల్లాల్లో ఏదో ఒక పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నమండలాల్లో ఎన్నికలు సజావుగానే జరిగాయి. బొటాబొటామెజారిటీ ఉన్న చోట్ల, పార్టీల్లో అంతర్గత విభేదాలునెలకొన్న చోట్ల ఎన్నికలు అంత సజావుగాజరగలేదు. దీంతో ఫలితాల వెల్లడిలో జాప్యంజరిగే పరిస్థితులు తలెత్తాయి.
కర్నూలు జిల్లాకోడుమూరు మండల పరిషత్ ఎన్నిక వాయిదాపడింది. కోరం లేకపోవడంతో ఈ ఎన్నికలను సోమవారంనాటికి వాయిదా వేసినట్లు ఎన్నికల అధికారిప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా మండల పరిషత్‌లఅధ్యక్ష, ఉపాధ్యక్ష, కో ఆప్టెడ్ సభ్యుల పదవులకుఆదివారం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.కాంగ్రెస్‌లోని అంతర్గత విభేదాల వల్ల కోడుమూరుమండల పరిషత్ ఎన్నికకు కోరం కరువైంది.
కడప రూరల్‌మండల పరిషత్ (ఎంపి) ఎన్నికలు వాయిదా పడ్డాయి. రాష్ట్రంలోనిఅన్ని మండల పరిషత్ అధ్యక్షుల, ఉపాధ్యక్షుల, కో ఆప్టెడ్ సభ్యులపదవులకు ఎన్నికలు జరిగాయి. కో ఆప్టెడ్ సభ్యులుగా ఎవరూనామినేషన్ వేయకపోవడంతో కడపమండల పరిషత్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ ఎన్నికలు సోమవారంజరుగుతాయని ఎన్నికల అధికారి ప్రకటించారు.
ప్రకాశం జిల్లాగిద్దలూరులో ఐదుగురు ఎంపిటిసి సభ్యుల కిడ్నాప్‌జరిగింది. దీంతో ఇక్కడ ఎన్నిక ఆగిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లాదేవరపల్లిలో కాంగ్రెస్ సభ్యుల మధ్యఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎన్నిక వాయిదాపడింది. మొలకల చెరువు, బుట్టాయిగూడెంలలో కూడా ఎన్నికలువాయిదా పడ్డాయి.
ఆదివారం సాయంత్రంవరకు ప్రకటించిన ఫలితాల ప్రకారం చిత్తూరుజిల్లాలో ఏడు మండలాలను తెలుగుదేశం, మూడుమండలాలను కాంగ్రెస్ కైవసంచేసుకున్నాయి. అనంతపురం జిల్లాలో 14తెలుగుదేశం పార్టీకి, 26 కాంగ్రెస్ పార్టీకి లభించాయి. నల్లగొండజిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది.తెలుగుదేశం పార్టీకి మూడు,
కాంగ్రెస్‌కు తొమ్మిది,టిఆర్‌ఎస్‌కు ఒకటి, వామపక్షాలకు నాలుగు లభించాయి. ఒకస్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.పెన్‌పహాడ్, చౌటుప్పల్‌లలో ఎన్నికలు వాయిదా పడ్డాయి.
శ్రీకాకుళంలో జిల్లాలోనిమండలాల్లో 17 కాంగ్రెస్, ఏడు కాంగ్రెస్ దక్కించుకున్నాయి.ఖమ్మంలో నాలుగు తెలుగుదేశం, కాంగ్రెస్,సిపిఐ, సిపిఎం మూడేసి మండలాల్లో గెలిచాయి.
నెల్లూరు జిల్లాలోనినాలుగు మండలాల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈజిల్లాలో తెలుగుదేశం పార్టీకి 12, కాంగ్రెస్‌కు 15,సిపిఎం, బిజెపిలకు ఒక్కటేసి దక్కాయి. పశ్చిమ గోదావరిజిల్లాలో మూడు మండలాల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి.నాలుగు టిడిపికి, 8 కాంగ్రెస్‌కు దక్కాయి.
వరంగల్ జిల్లావర్ధన్నపేట, కరీంనగర్ జిల్లా మంథని,ముత్తారం మండలాల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. కరీంనగర్‌జిల్లాలో టిఆర్‌ఎస్ హవా కొనసాగుతోంది. గుంటూరులోని సత్తెనపల్లిలో తమ సభ్యుడ్నికాంగ్రెస్‌వారు కిడ్నాప్ చేశారంటూ తెలుగుదేశంప్రదర్శన నిర్వహించింది. మహబూబ్‌నగర్ జిల్లాలోనిమద్దూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణచెలరేగింది.
విశాఖ పట్నంలో 18తెలుగుదేశం పార్టీకి, 13 కాంగ్రెస్‌కు దక్కాయి. పశ్చిమ గోదావరిజిల్లాలో 32 తెలుగుదేశం పార్టీ, 11 కాంగ్రెస్ కైవసంచేసుకున్నాయి. మొత్తం ఫలితాలు వెలువడడానికిచాలా సమయం పట్టవచ్చు.












Click it and Unblock the Notifications