ఆంధ్రా రైతులకు ఆల్మట్టి నీరు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా ఆయకట్టు భూముల్లో సాగునీరులేక నారుమళ్లు ఎండిపోతూ రైతులు తీవ్ర ఇబ్బందులనెదుర్కొంటున్న ఆంధ్రా రైతులను ఆదుకునేందుకు ఆల్మట్టి డ్యామ్‌నుంచి సాగునీరునుఅందించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ షయం తనకు ఇవాళ ఉదయం కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్.ఎం.కృష్ణ ఫోన్‌ద్వారా తెలియజేసినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
కాగా,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కోరిక మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు కర్ణాటక నీటిపారుదల శాఖామంత్రి హెచ్.కె.పాటిల్ ఇవాళ బెంగుళూరులో తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కృష్ణా ఆయకట్టు భూముల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications