తెలంగానంచేస్తేనే కాంగ్రెస్ తో దోస్తీ
వరంగల్‌ః ప్రత్యేక తెలంగాణా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా ప్రకటించేంత వరకు ఆ పార్టీతోస్నేహం చేసే ప్రసక్తి లేదని తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత చంద్రశేఖర రావు స్పష్టంగా ప్రకటించారు. గతంలో తెలంగాణా ఉద్యమాలకు వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ పార్టీ తన తప్పును ప్రజల ముందుఅంగీకరిస్తే ఆ పార్టీకి టిఆర్‌ఎస్ పూర్తి మద్దుతు ఇస్తుందన్నారు. శుక్రవారం ఆయన వరంగల్ లోవిలేకరులు సమావేశంలో మాట్లాడారు.
టిఆర్‌ఎస్ ప్రభావం వున్న అన్ని మండలాలు, జిల్లాల్లో ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు కోరుతూ తీర్మానాలు చేస్తామని ఆయన ప్రకటించారు. కుతంత్రాలతో పబ్బంగడుపుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లు వేశామా అని తెలంగాణా ప్రజలు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారని చంద్రశేఖర రావువిమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రత్యేక తెలంగాణా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే ఆ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు అభ్యంతరం లేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications