ఈతకు వెళ్లి నలుగురుపిల్లలు దుర్మరణం
కడప: కడప జిల్లా రాయచోటికి సమీపంలోని మాండవ్య నదిలో ఆదివారం మధ్యాహ్నం ఈతకు వెళ్లిన నలుగురు పిల్లలు నీట మునిగి దుర్మరణం పాలయ్యారు.వీరిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో ఆ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. రాయచోటి ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు మాండవ్య నది లోతైన గుంతల్లో వర్షం నీరు నిలిచింది. మాండవ్య నదిపై నిర్మించిన వంతెనకు సమీపంలోని ఒక లోతైన గుంతలో ఈతకు వెళ్లి ఈ పిల్లలు మునిగిపోయారు.
మరణించినవారిలో మేదర వీధికి చెందినషేక్ హస్సేన్ కుమారులు ఎస్. మహబూబ్ బాష, ఎస్. గౌస్ బాష,షేక్ అమీర్ బాషలతో పాటు మహబూబ్‌నగర్‌కు చెందినషేక్ అల్లాబకష్ కుమారుడు షేక్ బర్కతుల్లా వున్నారు. నీటిలోకి దిగినవీరు ఎంతకూ బయటకు రాకపోవడంతో కొందరు వెంటనే నీటిలోకి దిగి వారిని బయటకు లాగారు.అప్పటికే వారు మరణించారు.












Click it and Unblock the Notifications