భూమా మౌనిక పార్టీ, పోటీ చేసే నియోజకవర్గం ఫిక్స్ - అక్కడే అసలు ట్విస్ట్..!!

మంచు మనోజ్ తాజాగా చేసిన ప్రకటన సంచలనంగా మారింది. వచ్చే ఎన్నికల్లో భూమా మౌనిక ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించారు. ఏ పార్టీ.. ఏ నియోజకవర్గం స్పష్టం చేయలేదు. మౌనిక సొంత జిల్లా అయిన ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచే పోటీ చేస్తారనే అంచనాలు మొదలయ్యాయి. అయితే.. మౌనిక పోటీ పైన మనోజ్ తెర వెనుక కసరత్తు చేసారు. పూర్తి అంచనాలు.. నిర్ణయాలు జరిగిన తరువాతనే ప్రకటన చేసారు. దీంతో, మౌనిక ఎంట్రీ ఇచ్చే పార్టీ.. పోటీ చేసే నియోజకవర్గం పైన స్పష్టత వస్తోంది. అయితే.. అక్కడే అసలు ట్విస్ట్ నెలకొంది.

హీరో మంచు మనోజ్ తన సతీమణి భూమా మౌనిక పొలిటికల్ ఎంట్రీ పైన ప్రకటన చేసారు. భూమా దంపతుల మరణం తరువాత తన అఖిలకు మౌనిక, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి మద్దతు గా నిలిచారు. అఖిల గతంలో మంత్రిగా.. ప్రస్తుతం ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారు. మనోజ్ ను మౌనిక వివాహం తరువాత ఇప్పుడు రాజకీయ ఎంట్రీ పైన ప్రకటన వచ్చింది. అయితే.. మౌనిక ఆళ్లగడ్డ నుంచి పోటీ చేస్తారనే వాదన తెర పైకి వచ్చింది. అయితే.. తన సోదరి కోసం అఖిల తన నియోజకవర్గం త్యాగం చేసే అవకాశం కనిపించటం లేదు. ఇదే సమయంలో జగత్ విఖ్యాత్ రెడ్డి సైతం ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. నంద్యాల సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే.. కుటుంబానికి ఒక్క సీటే దక్కనుంది. కాగా.. మౌనిక ఇప్పుడు కర్నూలు జిల్లా నుంచి కాకుండా.. మనోజ్ ఆలోచనలకు అనుగుణంగా నడుచుకొనేందుకు సిద్దం అవుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు జరుగుతోంది.

రామ్మోహన్ కు కీలక శాఖ, పెమ్మసానికి ప్రమోషన్ - ఏపీ నుంచి మరో మంత్రి..ఆయనకే ఛాన్స్..!!
రామ్మోహన్ కు కీలక శాఖ, పెమ్మసానికి ప్రమోషన్ - ఏపీ నుంచి మరో మంత్రి..ఆయనకే ఛాన్స్..!!
manchu-manoj-reveals-wife-mounika-s-political-entry-here-s-the-real-story-behind-the-big-move

సీటు.. నియోజకవర్గం పైనే లెక్కలు

మనోజ్ గతంలో పవన్ ను కలిసారు. రాజకీయంగా పవన్ తో కలిసి ప్రయాణం చేయాలని మనోజ్ భావిస్తున్నారు. అందులో భాగంగా తిరుపతి.. చంద్రగిరి నియోజకవర్గాల పైన మనోజ్ ఫోకస్ చేసారు. 2024 ఎన్నికల్లో కూటమి పొత్తుల్లో భాగంగా తిరుపతి నుంచి జనసేన గెలుచుకుంది. కాగా.. మోహన్ బాబు విద్యా సంస్థలతో ఆ ప్రాంతంలో మంచు కుటుంబానికి గుర్తింపు ఉంది. అదే విధంగా మనోజ్ - మౌనిక సామాజిక సమీకరణం కలిసి వచ్చే అవకాశం ఉందని లెక్కలు వేస్తున్నారు. అందులో భాగంగా జనసేన నుంచి మౌనిక ను అసెంబ్లీ బరిలోకి దింపాలని మనోజ్ భావిస్తున్నారు. ఈ మేరకు పవన్ వద్ద ప్రతిపాదించేందుకు సిద్దం అవుతున్నారు. పొత్తులు.. ఇప్పటి కే నియోజకవర్గంలో సీటు పైన ఆశలు పెట్టుకున్న నేతలు.. సర్వే లెక్కలు అన్నీ కలిసి వస్తే వచ్చే ఎన్నికల్లో మౌనిక జనసేన నుంచి తిరుపతి అభ్యర్దిగా పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+