డిఎంకె ర్యాలీలో చెలరేగిన హింస
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధినిఅరెస్టు చేయడాన్ని నిరసిస్తూ చెన్నైలో ఆదివారం నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో డిఎంకె కార్యకర్తలు ముగ్గురు మరణించినట్లు సమాచారం. పోలీసులు లాఠీఛార్జీ చేయడం వల్ల, ప్రతిగా కార్యకర్తలు రాళ్లు రువ్వటం వల్ల వంద మందికిపైగా గాయపడ్డారు. గాయపడినవారిలో డిఎంకె మాజీ ఎంపి మొహమ్మద్ సఖీతో పాటు పలువురు మీడియా ప్రతినిధులు, పోలీసులు ఉన్నారు.
డిఎంకె అధ్యక్షుడు కరుణానిధి తన ప్రసంగంలో పోలీసుల వైఖరిని ఖండించారు. ర్యాలీనిదెబ్బ తీసే ఉద్దేశంతోనే పోలీసులు హింసకు దిగారని ఆయన అన్నారు. గడిచిన మూడు నెలల్లో అన్నాడియంకె ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన ఉదంతాలపైవిచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులను పోలీసులుఅరెస్టు చేయడాన్ని బట్టి చూస్తే ఇక్కడికి వస్తే ప్రధానినిఅరెస్టు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. పోలీసు కాల్పుల గురించి హైదరాబాద్‌లో వున్న తమిళనాడు ఇన్‌ఛార్జి గవర్నర్‌సి. రంగరాజన్‌కు కరుణానిధి ఫోన్‌లో వివరించారు. తగిన చర్యలు తీసుకుంటానని గవర్నర్ ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మొదట ప్రశాంతంగా సాగిన ర్యాలీ మెరీనా బీచ్ దగ్గర్లోని డిజిపి కార్యాలయం వద్దకు రాగానే ఉద్రిక్తంగా మారింది. ఒక బస్సుకు, జీపునకు, మరో వాహనానికి డిఎంకె కార్యకర్తలు నిప్పుపెట్టారు. మరి కొన్ని వాహనాలను ధ్వంసం చేశారు. దగ్ధమైన వాహనాల ఫొటోలు తీస్తున్న కెమెరామెన్‌పై, పాత్రికేయులపై డిఎంకె కార్యకర్తలు చేయి చేసుకున్నారు. పోలీసు అధికారులపైన రాళ్లు, చెప్పులువిసిరారు. దీంతో పోలీసులు లాఠీఛార్జి జరిపారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో టియర్ గ్యాస్‌షెల్స్ ప్రయోగించారు.












Click it and Unblock the Notifications