నక్సల్స్ మృతుల్లో క్రాంతి రణదేవ్?
వరంగల్: ఒరిస్సాలోని మల్లనగిరి ప్రాంతంలో రెండు పోలీసు స్టేషన్‌లపై జరిపిన దాడిలో మరణించిన నక్సల్స్ నేతల్లో ఒకరు క్రాంతి రణదేవ్ కావచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారే వరకు మల్కనగిరి ప్రాంతంలోని రెండు పోలీసు స్టేషన్లపై పీపుల్స్‌వార్ నక్సలైట్లు పెద్ద యెత్తున దాడి చేసిన విషయం తెలిసిందే.
ఇందులో ఇద్దరు నక్సల్స్ నాయకులు మరణించారు. ఇందులో ఒకరిని క్రాంతి రణదేవ్ అలియాస్ బక్కన్న, చంద్రన్న, చంద్రశేఖర్ అని అనుమానిస్తున్నారు. అయితే ఈవిషయాన్ని పోలీసులు ధృవీకరించడం లేదు. మృతుల్లో ఒక నక్సలైట్ ప్రకాష్ అనే దళ నేత కావచ్చునని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
క్రాంతి రణదేవ్ సుమారు రెండు దశాబ్దాల పాటుగాపీపుల్స్‌వార్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. వరంగల్ జిల్లాపీపుల్స్‌వార్ కార్యదర్శిగా పని చేశారు. 1993లో క్రాంతిరణదేవ్‌ను విడిపించుకోవడం కోసంపీపుల్స్‌వార్ అప్పటి విశాఖ జిల్లా చింతపల్లి శాసనసభ్యుడు పసుపులేటి బాలరాజును కిడ్నాప్ చేసింది.












Click it and Unblock the Notifications