లంక చేతిలో ఓడిన గంగూలీ బృందం
గాలేః శ్రీలంక చేతిలో భారత్‌ఘోరంగా పరాజయం పాలైంది. వైస్ కెప్టెన్ సమయోచిత బ్యాటింగ్, వెంకటేష్ ప్రసాద్ అమూల్యమైన పరుగులు భారత్ ను ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించి నప్పటికీ పరాజయం నుంచి తప్పించలేక పోయాయి. గురువారం నాడే భారత్ ఓటమి ఖాయమైపోయింది. 130 పరుగులకు 8వికెట్లు కోల్పోయిన భారత్ శుక్రవారం 180 పరుగులకు ఆలౌట్‌అయింది. దీనితో భారత్ కు కేవలం 6 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ నామమాత్ర లక్ష్యాన్ని జయసూర్య కేవలంఒకే ఓవర్ లో పూర్తి చేసి అరుదైన విజయాన్ని నమోదు చేసుకున్నాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్ లో 187 పరుగులకు ఆలౌట్‌అయింది. రమేష్, దాస్, కైఫ్ మినహా భారత జట్టులో ఎవరూ చెప్పుకోతగ్గ స్కోరు చేయలేదు. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో జయసూర్య, సంగకరసెంచరీలు చేయడంతో భారీగా 362 పరుగలు చేసి 175 పరుగలు ఆధిక్యాన్ని సాధించింది. ఇక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్
బ్యాట్స్ మెన్ శ్రేణి పేకమేడలా కూలిపోయారు. దాస్ 23, రమేష్ 2,కైఫ్ 14, గంగూలీ 4, బదాని5, డిఘే 3 పరుగలు మాత్రమే చేయడంతో భారత్ కు ఇన్నింగ్స్ పరాజయం గురువారం నాడే ఖరారైందు. అయితే శుక్రవారం ఉదయం ద్రావిడ్ చక్కగా ఆడి 63 పరుగులు చేయగా ఆతనికి వెంకటేష్ ప్రసాద్ చక్కటి మద్దతు ఇచ్చి 20 పరుగులు చేయడంతో భారత్ 5 పరుగులు ఆధిక్యం సాధించింది.
టెస్ట్ మ్యాచ్ లలో శ్రీలంక భారత్ పై విజయం సాధించడం 16 ఏళ్ళ తరువాత ఇదే ప్రథమం. తొలి ఇన్నింగ్స్ లో వేగంగాసెంచరీ చేయడంతో పాటు వికెట్లు కూడా తీసుకున్న లంక కెప్టెన్ జయసూర్యకు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.












Click it and Unblock the Notifications
