డ్రైవర్ లేకుండానే గూడ్సు పరుగు
గుంతకల్లు: గూడ్సురైళ్లలో అక్రమంగా సారా ప్యాకెట్లు రవాణా చేస్తున్న సారా వ్యాపారులు అనంతపురం జిల్లా గుంతకల్లులో గూడ్సురైలు డ్రైవర్లపై దాడికి ప్రయత్నించారు. సారా వ్యాపారులకు భయపడి గూడ్సురైలును నిలిపేసి డ్రైవర్లు
పారిపోయారు. దాంతో వ్యాపారులే రైలు బ్రేకులు తీసి డ్రైవర్ లేకుండాపంపారు.
గురువారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో గుంతకల్లు- తిమ్మనచెర్లస్టేషన్ల మధ్య గూడ్సు రైలు నిలిచి వుండడంతో అనుమానం వేసిఎక్సైజ్ మొబైల్ టాస్క్‌ఫోర్స్ బృందం అక్కడకు వెళ్లారు. సారా ప్యాకెట్లు గూడ్సురైలు నుంచి దింపుతున్న
ప్రాంతానికి టాస్క్‌ఫోర్స్ అధికారులు వెళ్తుండగానే వారు పరారయ్యారు. ఆ ప్రాంతం నుంచి 4,200 సారా ప్యాకెట్లుస్వాధీనం చేసుకున్నారు. బ్రేక్‌లు తీసివేయడంతో గూడ్సురైలు వెళ్లిపోయింది. దీంతో ఆందోళనకు గురైన గూడ్సు డ్రైవర్‌ఎక్సైజ్ వాహనంలో తిమ్మాపూర్ స్టేషన్‌కు వెళ్లాడు.స్టేషన్‌లో వున్న అసిస్టెంట్ డ్రైవర్ రామ్‌ప్రసాద్‌తో పాటు డ్రైవర్ వినోద్ కుమార్ సమస్ఫూర్తితో పట్టాలపై వెళ్తున్న గూడ్సులోకి ఎక్కి బ్రేక్‌లు వేసి నిలిపేశాడు.












Click it and Unblock the Notifications
