కాకర్లకు కోర్టు నోటీసులు
హైదరాబాద్‌ః తన జీవిత చరిత్రలో దివంగత తెలుగుదేశం అగ్రనేత ఎన్‌టిఆర్ జీవితం గురించివివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ వైద్యుడు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కాకర్ల సుబ్బారావుకు వ్యతిరేకంగా ఎన్‌టిఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పరువునష్టం దావాను కోర్టువిచారణకు స్వీకరించింది.
హైదరాబాద్‌లోనిఅయిదవ మెట్రోపాలిటన్ కోర్టు ఈ పిటీషన్‌నువిచారణకు స్వీకరిస్తూ కాకర్లకు నోటీసులు పంపిందనిపార్వతి తరఫు న్యాయవాది రామన్ శుక్రవారం నాడు వెల్లడించారు. కాకర్ల రాసిన ఎ డాక్టర్స్ స్టోరీ ఆన్ లైఫ్ అండ్ డెత్‌లో ఎన్‌టిఆర్ ఆఖరు క్షణాల్లో లక్ష్మీపార్వతి వైద్యసాయంఅందించలేదని రాసిన విషయం తీవ్రదుమారం సృష్టించినవిషయం విదితమే. కాకర్ల కొందరి చేతిలో పావుగా మారి తనను మానసింగా హింసించడానికి, వేధించడానికి ఇలాంటి రాతలు రాశారనిపార్వతి ఆరోపించారు.












Click it and Unblock the Notifications
