ప్రశాంతంగా రెండోవిడత పోలింగ్
హైదరాబాద్‌ఃరాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల రెండోవిడత పోలింగ్ శుక్రవారం నాడు స్వల్పఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. రాయలసీమలో ఫాక్షన్ జిల్లాల్లో, తెలంగాణాలోని నక్సల్స్ ప్రభావ ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. కోస్తా జిల్లాలో గుంటూరులో మాత్రమే ఉద్రిక్తత మధ్య పోలింగ్ జరిగింది. రాష్ట్ర మొత్తం మ్మీద పోలింగ్ సుమారు 75 శాతం మేర పోలింగ్ జరిగినట్టుగా అధికారులు ప్రకటించారు.
పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. చాలా గ్రామాల్లో ప్రజలు 10 గంటలకల్లా ఓటు వేసి తమతమ పనులపై వెళ్లిపోవడంతో 70 శాతం పోలింగ్ తొలి మూడు నాలుగు గంటల్లోనే జరిగింది. తొలివిడత అనుభవాల దృష్ట్యా పోలీసులుపెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడంతోఅవాంఛనీయ సంఘటనలు జరగలేదు.
కర్నూలు జిల్లా అవుకులో ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి హవాకు గండికొడుతూ ఎల్లయ్య అనే అభ్యర్ధి ఘనవిజయం సాధించారు. ఎప్పుడూ రామకృష్ణారెడ్డి సూచించిన మేర ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగే ఈ గ్రామంలో తొలిసారిగా ఆయన అభ్యర్ధికి వ్యతిరేకంగా ఎల్లయ్య బరిలోకి దిగివిజయం సాధించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో అభ్యర్ధి గుండెపోటుతో మరణించారు.
దాంతో ఇక్కడ ఎన్నికను రద్దు చేశారు. ఇదే జిల్లాలోని మల్కాపురంలో ఘర్షణలు జరిగాయి. దాంతో కొన్ని చోట్ల పోలింగ్‌ను వాయిదా వేశారు.విజయనగరం జిల్లా గంట్యాడలో, కృష్ణాజిల్లా మచిలీపట్నంలో కూడాస్వల్పఘర్షణలు జరిగాయి.శుక్రవారం నాడు పెనుగొండ, ఆదిలాబాద్, మంచిర్యాల, కడప, చిత్తూరు, కాకినాడ, రాజమండ్రి, కొవ్వూరు, గుంటూరు, పాల్వంచ, భద్రాచలం, మంధని,పెద్దపల్లి, నంద్యాల, మచిలీపట్నం, మెదక్, మహబూబ్ నగర్, మిర్యాలగూడ, నల్గొండ, కావలి, నిజామాబాద్, మర్కాపురం, చేవెళ్ళ, టెక్కలి, పాడేరు,విజయనగలం, మహబూబాబాద్ రెవెన్యూ డివిజన్ లల పోలింగ్ జరిగింది.












Click it and Unblock the Notifications
