వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యుత్‌ బిల్లుకు కేంద్రం ఆమోదం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ ః విద్యుత్‌ రంగంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టగల విద్యుత్‌ బిల్లు-2001కి కేంద్ర కేబినెట్‌ ఆమోదం లభించింది. ఈ బిల్లువల్ల రాష్ట్రాలు విద్యుత్‌ రంగానికి సంబంధించి తమ సొంతబాణీలో సంస్కరణలను అమలు చేయడానికి అవకాశం వుంటుంది.

1910 భారతవిద్యుత్‌ చట్టం, 1948 విద్యుత్‌ సరఫరా చట్టం, 1998విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌ స్థానే ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఎన్నికల వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలనే ప్రతిపాదనపై హోంమంత్రి అద్వానీ సారథ్యంలో మంత్రుల సంఘాన్ని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్ధికమంత్రి, న్యాయశాఖమంత్రి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఈ బృందంలో సభ్యులుగా వున్నారు.

కేబినెట్‌ సమావేశంలోనే బిఐఎఫ్‌ఆర్‌ స్థానంలో ఖాయిలా పడిన సంస్థల కోసం జాతీయ కంపెనీల ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ట్రిబ్యునల్‌ 20 నెలల్లోనే ఖాయిలా
సంస్థల సమస్యను పరిష్కరిస్తుంది. కార్మికులు ప్రయోజనాలకు భంగం కలగకుండా ఈ కొత్త ట్రిబ్యునల్‌ అన్ని చర్యలు తీసుకుంటుంది. పార్లమెంట్‌ సభ్యుల జీతభత్యాలపెంపునకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా ఆమోదించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X