వందరూపాయలకేమినీ గ్యాస్ సిలిండర్
రాజమండ్రిఃపేదవారి సౌలభ్యం కోసం 5 కేజీల బరువున్నమినీ గ్యాస్ సిలిండర్లను వందరూపాయలకే పంపిణీ చేయనున్నట్లు కేంద్రపెట్రోలియం శాఖ మంత్రి రాం నాయక్ ప్రకటించారు. దీపం పధకం లబ్ది దారులకు ఈ తక్కువ ధర సిలిండర్లు ఎంతగానే సౌకర్యంగా వుంటాయని ఆయన అన్నారు. సోమవారం ఆయన తాటిపాకలో వందకోట్లతో ఏర్పాటు చేసిన రిఫైనరీని ప్రారంభించారు. ఇక మీదట తాటిపాక ప్రాంతంలో వెలికి తీసిన గ్యాస్ ను విశాఖకు తరలించాల్సిన అవసరం లేకుండా ఇక్కడే శుద్ధి చేసేందుకు ఈ రిఫైనరీ ద్వారా వీలు కలుగుతుందని రాం నాయక్ చెప్పారు.
ఆంధ్ర ప్రదేశ్ లో దీపం పధకం లబ్ది దారులకు మరో 15 లక్షల గ్యాస్ కనెక్షన్లు కొత్తగా మంజూరు చేయనున్నట్లు మంత్రివివరించారు. దీపం లబ్ది దారులకు వందరూపాయలకే గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయడం వల్ల ఎంతగానో ప్రయోజనం చేకూరుతుందని రాం నాయక్ అన్నారు. సోమవారం ప్రారంభించినరిఫైనరీని 450 రోజుల్లో పూర్తి చేశారు. ఇది మొబైల్ రిఫనరీ అని ఎక్కడ నిక్షేపాలుంటే అక్కడకు దీనిని తరలించి గ్యాస్, చమురును శుద్ధి చేసుకోవచ్చునని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో లోక్ సభస్పీకర్ జిఎంసి బాలయోగి, కేంద్ర మంత్రి కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications
