సుప్రీం ను ఆశ్రయించిన జయలలిత
న్యూఢిల్లీః టాన్సీకేసుపై ఇచ్చిన స్టే ఎత్తి వేయాల్సిందిగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టాన్సీ కేసును త్వరగా పూర్తి చేయాలని తమిళనాడు హైకోర్టు ఆరాటపడుతున్నదని వ్యాఖ్యానించడంతో పాటు ఈ కేసు పైస్టే ఇచ్చింది. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవిఅయినందున స్టే ఎత్తివేసి, తదుపరి విచారణ జరిపేందుకు మద్రాస్ హైకోర్టును అనుమతించాలని జయకోరారు.
సుప్రీం వ్యాఖ్యలతో మద్రాసు హైకోర్టు టాన్సీ కేసును శుక్రవారం నిరవధికంగా వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ఇచ్చినస్టే జయలలితకు శరాఘాతంగా పరిణమించింది. ఆమె త్వరలో శాసనసభకు ఎన్నిక కావలసి వుండగా సుప్రీం ఈ విధంగాస్టే ఇవ్వడంతో ఎన్నికల్లో పోటీకి ఆమె ఇంకా అనర్హురాలిగానే వుంది. మూడు అవినీతి కేసులపై మద్రాసు హైకోర్టువిచారణ జరుపుతున్నది.
ఈ కేసుల్లో ఆమె నిర్దోషిగా తేలకపోతే ఆమె ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హురాలౌతారు. సుప్రీం జోక్యంతో హైకోర్టువిచారణ వాయిదా వేయడంతో జయ సుప్రీం కోర్టునే ఆశ్రయించారు. జయ పిటిషన్ ను జస్టిస్ బరుచా శుక్రవారం పరిశీలిస్తారు.












Click it and Unblock the Notifications
