జ్యోతిషంపై కేంద్రానికి సుప్రీం నోటీసు
న్యూఢిల్లీః జ్యోతిషాన్నివిశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశంగా ప్రవేశపెట్టే అంశంపై సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. జ్యోతిర్‌విజ్ఞాన్ పేరిట జ్యోతిషాన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏమోచ్చిందో వివరించాల్సిందిగా సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది.
జ్యోతిషం, పౌరోహిత్యాన్నివిశ్వవిద్యాలయాల్లో కోర్సులుగా ప్రవేశపెట్టాలంటూ యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ ఇటీవల ఓ సర్క్యులర్ జారీ చేసింది. యు.జి.సి. వైఖరిని వివిధ శాస్త్రవేత్తలు దుమ్మెత్తిపోశారు. ఈ వ్యవహారంపై కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా దుమారం చెలరేగుతున్నవిషయం విదితమే. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ కు చెందినపి.ఎం. భార్గవ అనే శాస్త్రవేత్త సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను పరిశీలించిన సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
ఈ శాస్త్రవేత్త కొద్దిరోజుల కిందట ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా రెండు పిటిషన్లు దాఖలు చేయగా నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన దరిమిలా పిటిషన్ ను కొట్టివేశారు.
సశాస్త్రీయం కాని జ్యోతిషాన్ని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాశంగా ప్రవేశపెడితే ప్రజల్లోవిద్య పట్ల దురభిప్రాయం ఏర్పడుతుందని పిటిషనర్ తరవు న్యాయవాది వాదించారు. దేశంలో హిందూత్వ వాదాన్నిపెంచి పోషించేందుకే కేంద్రం ఈ కోర్సును ప్రవేశపెడుతున్నదన్నారు.అందరికీ చదువుకొనే హక్కు వున్నప్పటికీ వేదవిద్య సాధారణవిద్యపై దుష్ప్రభావం చూపుతుంది కాబట్టి దానినివిశ్వవిద్యాలయాల్లో ప్రవేశపెట్టరాదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు.












Click it and Unblock the Notifications
