ఆఖరు అంకంలో దేశం ఆత్మవిమర్శ
హైదరాబాద్‌ః ఈ మధ్య కాలంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టి దెబ్బతిన్న తెలుగుదేశం పార్టీ నాయకత్వం, పార్టీని బలోపేతం చేసే అంశంపై దృష్టి కేంద్రీకరించింది.
ఇందులో భాగంగా గత కొద్ది రోజులుగా జిల్లాల వారిగా జరుపుతున్న ఆత్మపరిశీలన సమావేశాలు ముగింపునకు వచ్చాయి. ఈ సమావేశాల పరంపరలో ఆఖరుదైన గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల సమావేశం సోమవారం నాడు జరిగింది. ఈ జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ దెబ్బతినడానికి కారణాలను ఆయా జిల్లాల నాయకులువివరించారు.
ఈ జిల్లాల్లో పార్టీ బలహీనతలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరా తీశారు. ఈ సమావేశాలు ముగిసినందున ఇప్పుడు అత్యున్నత స్థాయి సమీక్ష కమిటీ సమగ్ర నివేదికను తయారు చేసి ముఖ్యమంత్రికిఅందజేస్తుంది. ఈ నివేదిక ఆధారంగా పార్టీని బలోపేతం చేసేందుకు సమగ్ర ప్రణాళికను రచించనున్నట్టుగా తెలుగుదేశం అధికార ప్రతినిధి రావుల చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు.
త్వరలోనే నియోజకవర్గం స్థాయి సమావేశాల నిర్వహణకు కూడా తెలుగుదేశం పార్టీ సమాయత్తం అవుతున్నది.












Click it and Unblock the Notifications
