దేశం హత్యాకాండపై కాంగ్రెస్‌ ఆగ్రహం

హైదరాబాద్‌ః కాంగ్రెస్‌ పార్టీలో క్రమశిక్షణా రాహిత్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ నిర్ణయించింది. పిసిసి నూతన కార్యవర్గం తొలి సమావేశం మంగళవారం గాంధీభవన్‌ లో జరిగింది. 108 మంది నూతన కార్యవర్గ సభ్యులకు గాను 64 మంది ఈ సమావేశానికిహాజరయ్యారు. పిసిసి అధ్యక్షుడు ఎం. సత్యనారాయణ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 14 కీలకమైన తీర్మానాలు చేశారు. నోడల్‌ వ్యవస్థను తక్షణం రద్దు చేయాల్సిందిగా పిసిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

కరవు సాయాన్ని ముమ్మరం చేయాలని, ఏలేరుపైవిచారణను పునరుద్ధరించాలని సమావేశం తీర్మానించింది. స్థానిక సంస్థలకు రాజ్యాంగం ప్రకారం సంక్రమించిన అధికారాలను సత్వరం బదలాయించాలని కూడా పిసిసి కోరింది. తెలుగుదేశం పార్టీ హత్యా రాజకీయాలను సమావేశం తీవ్రంగావిమర్శించింది. హత్యా రాజకీయాలకు స్వస్తి చెప్పక పోతే తెలుగుదేశం ప్రభుత్వం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని కూడా కాంగ్రెస్‌ పార్టీ హెచ్చరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+