సుప్రీంకోర్టులో జయకు చుక్కెదురు
న్యూఢిల్లీః టాన్సీ కేసువిచారణపై విధించిన స్టేను ఎత్తివేయాల్సిందిగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చేసుకున్నవిజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాలేని జయలలిత ముఖ్యమంత్రిగా పదవి చేపట్టడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టువిచారణ ప్రారంభించింది. తన కేసులపై స్టే ఎత్తివేయకపోగా, తనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపైవిచారణ ప్రారంభించడంతో జయలలిత ఇరకాటంలో పడ్డారు.
టాన్సీ కేసువిచారణలో అనవసరమైన తొందర ప్రదర్శిస్తున్నారంటూ సుప్రీంకోర్టుమద్రాస్ హైకోర్టును చీవాట్లు పెట్టడంతో పాటు ఆ కేసువిచారణపై స్టే ఇచ్చింది. ఆ స్టేను ఎత్తివేయాల్సిందిగా జయలలిత సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు త్రోసిపుచ్చడంతో నవంబర్ 13 లోగాఅసెంబ్లీకి ఎన్నిక కావాలనే జయ ఆశలు అడియాసలుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాన్సీతో పాటు మరో కేసులో కూడా జయలలితకు రెండేళ్ళ పాటు శిక్ష పడింది. ఈ వ్యవహారంపై జయ పై కోర్టుకుఅప్పీలు చేసుకుంది. శిక్ష పడిన వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదంటూ ఎన్నికల సంఘం ఆమె నామినేషన్ ను తిరస్కరించడం, ఆమె పార్టీ ఘనవిజయం సాధించగా జయలలితే తమిళనాడు ముఖ్యమంత్రి కావడం తెలిసింది. అయితే ఆమె నవంబర్ 16 లోగాఅసెంబ్లీకి ఎన్నిక కాకుంటే ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సి వస్తుంది.
హైకోర్టులో ఈ రెండు కేసులను త్వరిత గతిన పూర్తి చేయించాలనే ఆలోచనకు సుప్రీంకోర్టు అడ్డు తగిలింది.పైగా ఆ కోసు విచారణను నిరవధికంగా వాయిదా వేసింది. ఈ తరుణంలో జయలలిత ఏ ఎత్తు వేస్తారో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications
