రెండొపెళ్ళి వివాదం-మహంత రాజీనామా
గౌహతిః చట్టవిరుద్ధంగా రెండోపెళ్ళి చేసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నఅస్సాం మాజీ ముఖ్యమంత్రి ప్రపుల్ల కుమార్ మహంత్‌అస్సాం గణసంగ్రామ పరిషత్ అధ్యక్షపదవికి, లెజిస్లేచర్ పార్టీ నాయకత్వానికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల రెండు పదవులకు రాజీనామా చేస్తున్నట్లు మహంత పార్టీ తాత్కాలిక అధ్యక్షుడువిరాజ్ శర్మకు మంగళవారం ఓ లేఖ రాశారు. గురువారం జరిగే పార్టీ కీలక సమావేశంలో ఈవిషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం వుంది.
పార్టీ భవిష్యత్తు దృష్ట్యా పుట్టిన నాటినుంచి అనుబంధం వున్నఅస్సాం గణ సంగ్రామ పరిషత్ నుంచి తప్పుకుంటున్నానని మహంత ఆ లేఖలోపేర్కొన్నారు. పార్టీ సాధారణ కార్యకర్తగా నిరంతరం సేవలందిస్తానని ఆయన చెప్పారు.అస్సాం అసెంబ్లీ సెక్రటేరియట్ ఉద్యోగిస్తురాలైన సంఘమిత్రతో మహంతకువివాహేతర సంబంధాలున్నాయి. మొదటి భార్య వుండగానే ఆయన గత మార్చిలో సంఘమిత్రను రెండోపెళ్ళి చేసుకున్నారు. ఈ వ్యవహారం పెనువివాదానికి దారితీయడంతో మహంత పార్టీ సారధ్యాన్ని తాత్కాలికంగావిరాజ్ శర్మకు అప్పగించారు.
ఈ వివాదం దరిమిలా పార్టీ అధ్యక్షపదవికి, లెజిల్లేచర్ పార్టీ నాయకత్వానికి కూడా మంగళవారం ఆయన రాజీనామా సమర్పించారు.












Click it and Unblock the Notifications
