వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మణిపూర్‌ లో రాష్ట్రపతిపాలనకు ఓ.కె

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః ప్రధాని వాజ్‌పేయి అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్ర క్యాబినెట్‌ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. క్రీడలను రాష్ట్రాల జాబితా నుంచి ఉమ్మడిజాబితాలోకి మార్చే పనిని తాత్కాలికంగా వాయిదా వేసింది. క్రీడాకారులు డోపింగ్‌, మ్యాచ్‌ఫిక్సింగ్‌ వంటి అక్రమాలకు పాల్పడుతున్నందున క్రీడా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు క్రీడలను ఉమ్మడి జాబితాలో చేర్చాలని కేంద్ర భావించింది. అయితే రాష్ట్రాల అభిప్రాయాలను గౌరవిస్తూ ఈ ప్రతిపాదనను తాత్కాలికంగా వాయిదా వేసింది. ఇకపోతే మణిపూర్‌ లో రాష్ట్రపతి పాలనకు కేంద్ర గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కేంద్ర నిర్ణయం కారణంగా అక్కడ ఎన్నికల ప్రక్రియకుశ్రీకారం చుట్టే వీలు కలుగుతుంది.

విద్యకాషాయీ కరణ అబద్ధంః జోషి
విద్యను కాషాయీకరిస్తున్నట్లు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలుఅర్థరహితం అని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి మురళీ మనోహర్‌ జోషి అన్నారు. వారు ఏవో ఆరోపణలు చేయడం కాకుండా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే తప్పులు సరిచేసుకుంటామని చెప్పామన్నారు. ఎక్కడ తప్పులు జరిగాయో చెప్పకుండావిద్య కాషాయీకరణ జరుగుతున్నదంటూ గగ్గోలు పెట్టడంఅర్థంలేదన్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు ప్రతిపక్షాలఅర్థరహిత వాదనకు ప్రభావితం కావడంలోఅర్థంలేని జోషి అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X