భూములు పంచితే నక్సలిజం మాయం!
హైదరాబాద్‌ః రాష్ట్రంలోమిగులు భూముల పంపిణీ కార్యక్రమాన్ని సత్వరం పూర్తి చేసినప్పుడే తీవ్రవాద సమస్య కొంతవరకైనా తగ్గుతుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రివిద్యాసాగర్ రావు అన్నారు. నక్సలైట్లు హింసామార్గాన్ని విడనాడాలని ఆయన మంగళవారం జరిగినవిలేకరుల సమావేశంలో పిలుపునిచ్చారు.
నక్సలిజాన్ని సమర్ధంగా ఎదుర్కొనేందుకు పోలీసులకు అత్యంత అధునాతన ఆయుధాలు అవసరమని కూడావిద్యాసాగర్ రావు అభిప్రాయపడ్డారు. నక్సలిజంపై పోరుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం 164 కోట్ల రూపాయలను ఇచ్చే ప్రతిపాదన పరిశీలనలో వున్నదని ఆయన చెప్పారు.
నక్సలైట్లపై పోరుకు రాష్ట్రానికి ఇచ్చే నిధుల వ్యవహారాన్ని కేంద్ర ప్రణాళికా శాఖ పరిశీలిస్తున్నదని ఆయనవివరించారు. మిగులు భూముల పంపిణీ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేయకుండా సత్వరం పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దున్నే వాడిదే భూమి అనే సూత్రాన్ని అమలు చేస్తే నక్సలిజం సమస్యకు కొంత వరకు పరిష్కారం లభిస్తుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
